Begin typing your search above and press return to search.

క్రాక్ బ్యూటీ టాట్టూలు కిర్రాకులే

By:  Tupaki Desk   |   28 Jan 2020 4:04 PM GMT
క్రాక్ బ్యూటీ టాట్టూలు కిర్రాకులే
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గారాలప‌ట్టి శృతిహాస‌న్ వెస్ట్ర‌న్ పోక‌డ‌ గురించి తెలిసిందే. సినీ స్టార్ కాక‌ముందు పాప్ స్టార్ కావాల‌ని క‌ల‌లు కంది. కేవ‌లం ఒక లోక‌ల్ స్టార్ గా మిగిలిపోవాల‌న్న ఆలోచ‌న త‌న‌కు ఏనాడూ లేదు. అందుకు త‌గ్గ‌ట్టే త‌న ప్ర‌ణాళిక‌లు సాగాయి. అయితే తాను ఆశించిన‌ది ఒకటి అయితే జ‌రిగిన‌ది ఇంకొక‌టి.

విదేశీ బోయ్ ప్రెండ్ మైఖెల్ కోర్స‌లే తో రిలేష‌న్ షిప్ దెబ్బ‌తిన్న త‌ర్వాత త‌న గేమ్ మొత్తం ఛేంజ్ అయ్యింది. తిరిగి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టి కెరీర్ గురించి సీరియ‌స్ గా ఆలోచిస్తోంది. ప్రేమాయ‌ణం వ‌ల్ల‌ దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగా వేచి చూడాల్సి రావ‌డంతో కెరీర్ ప‌రంగా అన్నివిధాలా పెద్ద‌ దెబ్బ ప‌డిపోయింది. అయినా కంబ్యాక్ కోసం తెలుగు- త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ సినిమాలో న‌టిస్తోంది. కోలీవుడ్ లో టాప్ హీరో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న లాభం చిత్రంలో న‌టిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి స‌క్సెస్ అయితే త‌ప్ప శ్రుతి కెరీర్ ఊపంద‌కునే అవ‌కాశం క‌న్పించ‌లేదు. శ్రుతి గ్యాప్ తీసుకున్న స‌మ‌యంలోనే న‌వ‌త‌రం బ్యూటీస్ స‌ర్రున దూసుకురావ‌డంతో పోటీ తీవ్రంగా ఉందిప్పుడు. ఇక‌పై ప్ర‌తి అడుగులోనూ స‌క్సెస్ మాత్ర‌మే ఇక్క‌డ కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. స్పీడ్ అందుకునే వ‌ర‌కూ ఫ్యాన్స్ కి ర‌క‌ర‌కాల మార్గాల్లో ట‌చ్ లో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ మంగ‌ళ‌వారం శృతి పుట్టిన‌రోజు. ఈసంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో కొన్ని మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోటోల‌ను షేర్ చేసింది. శ్రుతి షేర్ చేసిన నాలుగు ఫోటోల్లో గులాబీ టాట్టూ క‌ళ్ల‌ను తిప్పుకోనివ్వ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఒక ఫోటోలో రెబాన్ అద్దాలు ధ‌రించి ఫోజిచ్చింది.. వేరొక ఫోటోలో ఎంతో నేచుర‌ల్ గా క‌నిపించినా ఆ మోచేతిపై గులాబీ టాట్టూను చూపిస్తోంది. మెడ భాగంలో టాట్టూ.. కాలి పాదంపై మ‌రో టాట్టూ అన్ని ఫోటోల్ని గంప‌గుత్త‌గా అభిమానుల‌కు షేర్ చేసింది. స‌రిగ్గా భుజం వెనుక భాగంలో ఉన్న టాట్టు త‌మిళ అక్ష‌రాల‌తో రాసి ఉంది. మ‌రో టాట్టూ ఎడ‌మ కాలు మ‌ణిక‌ట్టు మీద ఉంది. మ‌రో రెండు స్టైలిష్ ఫోటోల‌ను కూడా బ‌ర్త్ డే కానుక‌గా షేర్ చేసి అభిమానులు ఖుషీ చేసింది. ఒక ఫోటోలో బుంగ‌మూతితో టీజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. క్రాక్ లో శృతి లుక్ కి సంబంధించిన ఓ స్టిల్ ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట‌ర్ లో శృతి చీర‌క‌ట్టి తెలుగింట ఆడ‌ప‌డుచులా క‌నిపించింది.