Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ ని అమ్మడు అందుకే రిజెక్ట్ చేసిందా...?

By:  Tupaki Desk   |   18 Jun 2020 8:10 AM GMT
పవర్ స్టార్ ని అమ్మడు అందుకే రిజెక్ట్ చేసిందా...?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఈ జోడీని మరోసారి స్క్రీన్ పై చూడొచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. 'గబ్బర్ సింగ్' 'కాటమ రాయుడు' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ చెప్పుకున్నారు. అయితే ఆ తర్వాత శృతి ఈ సినిమాలో నటించడం లేదంటూ న్యూస్ రావడంతో నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాత్రం 'వకీల్ సాబ్'లో శృతి హాసన్ నటిస్తోందని చెప్పుకొచ్చాడట.

ఇదిలా ఉండగా శృతి హాసన్ ఇటీవల ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చి స్వీయ నిర్బంధంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు మరియు వేణు శ్రీరామ్ లు శృతి హాసన్ ని 'వకీల్ సాబ్' సినిమాలో నటింపజేయాలని ప్రయత్నం చేశారట. అయితే ప్రస్తుతం తక్కువ నిడివి గల పాత్రలు, స్పెషల్ రోల్స్ చేసే ఉద్దేశ్యం లేదని శృతి సున్నితంగా తిరస్కరించిందట. వేణు శ్రీరాం - దిల్ రాజులతో కలసి శృతి హాసన్ ఇంతక ముందు 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా దిల్ రాజు బ్యానర్ లో పలు చిత్రాల్లో నటించింది. ఈ పరిచయంతో 'వకీల్ సాబ్'లో స్పెషల్ రోల్ చేయమని అడిగినప్పటికీ శృతి సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అయితే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కకున్న సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కాగా శృతి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ - గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతున్న 'క్రాక్' సినిమాలో నటిస్తోంది.