ఫొటోటాక్ : 'బ్యూటీ'ఫుల్ మాస్క్ తో కరోనాకు చెక్

Mon Jul 13 2020 17:00:45 GMT+0530 (IST)

Phototalk: Check virus with a Beautiful Mask

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా శృతి హాసన్ ఒక అందమైన బటర్ ఫ్లై మాస్క్ ను ధరించి వావ్ అనిపించేలా సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. శృతి హాసన్ చేసిన ఆ పోస్ట్‌కు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా 1.7 లక్షల మంది లైక్స్ తో ఈ ఫొటోలను అభినందించారు. ఈ ఫొటోలతో మాస్క్ తప్పనిసరి అంటూ చెప్పడంతో పాటు శృతి హాసన్ విభిన్నమైన మాస్క్ ను జనాలకు చూపించింది.హీరోయిన్ గా కాస్త గ్యాప్ తీసుకున్న శృతి హాసన్ బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బిజీ అయ్యింది. బాలీవుడ్ లో ఇటీవల నటించిన సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శృతి హాసన్ తెలుగులో క్రాక్ సినిమాతో కూడా ప్రేక్షకు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ రెండు సినిమాలతో పాటు పలు సినిమాలు చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలు సోషల్ మీడియాతో బిజీ బిజీగా ఉండే శృతి హాసన్ తాజాగా బ్యూటీఫుల్ మాస్క్ ను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుని వైరల్ అయ్యింది.