విస్కీ అంటే పిచ్చి.. చిన్న బ్రేకిచ్చానంతే!

Wed Oct 09 2019 21:06:16 GMT+0530 (IST)

Shruthi Hassan Shares How Alcohol Effected Her!

సెలబ్రిటీల సీక్రెట్స్ అన్నిటినీ బయట పెట్టేస్తూ.. మంచు లక్ష్మీ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారు. వ్యక్తిగతంగా బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాల్ని సెలబ్రిటీలతో బయటికి చెప్పించడంలో లక్ష్మీ టాక్ షో `ఫీట్ అప్ విత్ ది స్టార్స్` పెద్ద సక్సెసవుతోంది. ఇక్కడ స్టార్లు ఎలాంటి భేషజం.. సిగ్గు బిడియం లేకుండా అన్ని రహస్యాల్ని ఓపెన్ అయిపోతున్నారు. పడక గది రహస్యాలు .. ఆల్కహాల్ సేవనం వంటి విషయాల్ని ఓపెన్ గానే అంగీకరిస్తున్నారు.ఒక హీరో చెమట కంపు భరించలేకపోయాను! అంటూ రకుల్ ప్రీత్ షాకింగ్ నిజాన్ని చెప్పింది ఈ వేదికపైనే. చైతూ పడకగది రహస్యాల్ని సమంత అక్కినేని బిడియపడకుండా వెల్లడించారు ఇదే వేదికపై. తాజాగా అందాల శ్రుతిహాసన్ ఓ టాప్ సీక్రెట్ ని బయటకు చెప్పేయడం యూత్ లో వేడెక్కిస్తోంది. బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోవడానికి కారణం చెప్పిన శ్రుతి.. తాగుడుకు సంబంధించిన హీటెక్కించే విషయాన్ని లక్ష్మీ టాక్ షోలో బయట పెట్టారు.

``నాకు విస్కీ అంటే పిచ్చి. కానీ తాగుడుకు చిన్న బ్రేకిచ్చా. ఇది నాలో వచ్చిన కొత్త మార్పు`` అని చెప్పి శ్రుతి పెద్ద షాకిచ్చింది. తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని.. కానీ ఈ విషయం గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదని నవ్వేశారు శ్రుతి. తాగుడు వల్ల అనారోగ్యానికి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అయితే ఈ నిజం చెప్పించేందుకు లక్ష్మీ మంచు వేసిన బిస్కెట్ మామూలుగా లేదు. ``నీకు విస్కీ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు ఓ రెస్టారెంట్ కి వెళ్లాం. అక్కడ నువ్వు విస్కీ ఆర్డర్ చేసుకున్నావ్. ఇప్పుడు అన్నీ మానేసినట్టున్నావ్. ఎందుకో తెలుసుకోవచ్చా?? అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా సూటిగానే ప్రశ్నించారు. మొత్తానికి ఎలాంటి నిజాల్ని చెప్పిస్తే టీఆర్పీ పరుగులు పెడుతుందో అలాంటి ప్రశ్నలతో లక్ష్మీ మంచు మంటలు పుట్టించారు. అందుకు తాపీగా సమాధానాలిస్తూ శ్రుతి అంతే జోవియల్ గా కార్యక్రమాన్ని ఆస్వాధించారు.

శ్రుతి చెప్పిన నిజాలకు కుర్రకారు మాత్రం ఇంకా షాక్ నుంచి తేరుకోవడం లేదు. శ్రుతిహాసన్ స్మోకింగ్ - డ్రింకింగ్ హ్యాబిట్స్ గురించి ముంబై మీడియాలో అప్పట్లోనే పలు కథనాలొచ్చాయి. ప్రస్తుతం తెలుగు లోగిళ్లకు బుల్లితెర ద్వారా తెలిసింది అంతే.