ఫోటో స్టొరీ: శృతి చేయడం మొదలెట్టింది

Sun Mar 24 2019 23:25:35 GMT+0530 (IST)

Shruthi Hassan Latest Photo Shoot Photo

శృతి హాసన్ హీరోయిన్ గా కెరీర్లో ఎత్తుపల్లాలను రెండింటినీ చూసింది.  కెరీర్ ప్రారంభంలోనే వరస ఫ్లాపులనెదుర్కొంది.  పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ సాధించడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారింది.. ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే కలగలేదు.  తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా హిట్లు సాధించి కెరీర్ లో పీక్ లో ఉన్నదశలో సుందర్. C ప్రాజెక్టు నుండి బయటకు రావడంతో పాటు ఇతర చిత్రాలు కూడా ఫ్లాప్ కావడం.. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ తో ప్రేమాయణం అన్నీ కలిసి శృతికి సినిమాలు లేకుండా చేశాయి.రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా లండన్లో ఉంటూ సింగింగ్ కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న శృతి అక్కడ వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు ఈమధ్య వినిపిస్తున్నాయి. మైఖేల్ తో తెగదెంపులు చేసుకుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.  మైఖేల్ తో బ్రేకప్ సంగతేమో కానీ రీ-ఎంట్రీ  మాత్రం కన్ఫామ్ అయింది.  ఎందుకంటారా? ఒక్కసారిగా రెడ్ హాట్ ఫోటో షూట్ చేసింది.  ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం రెడ్ కలర్ థై స్లిట్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. తనదైన స్టైల్ లో నవ్వుతూ క్లీవేజ్ అందాలను ధారపోసింది. ఇంకేముంది. అసలే ఎలెక్షన్ హీటుతో ఊపిరి ఆడకుండా చస్తున్న నెటిజనులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది.

శృతి ఫిట్నెస్ చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ కు గట్టిగా నెట్ ప్రాక్టిస్ చేసి వచ్చినట్టుగానే ఉంది. సినిమాలకు గ్యాప్ వచ్చినా మంచి ఆఫర్లు వస్తున్నాయట. తమిళంలో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని అతిత్వరలో ప్రకటనలు ఉంటాయని సమాచారం.