ఫోటో స్టోరి: అభిమానులకు క్రాక్ పుడుతుందేమో!!

Tue Aug 04 2020 15:00:38 GMT+0530 (IST)

Photo Story: Shruthi Over of Style

నటించిన తొలి సినిమాతోనే తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది శ్రుతిహాసన్. అయినా అలా విమర్శించేవాళ్లు ఉండబట్టే అన్నిటినీ కరెక్షన్ కి తెచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సద్విమర్శల్ని మంచి కోసం ఉపయోగించింది. ``నీ ముక్కు సూదిగా ఉంది... నీ రూపం మగరాయుడిలా ఉంది!`` అన్న విమర్శలకు వెంటనే చెక్ పెట్టేసేందుకు `లక్` సినిమా రిలీజవ్వగానే శస్త్ర చికిత్సలకు రెడీ అయ్యింది. నా ముక్కు నా ఇష్టం.. అంటూ శస్త్ర చికిత్స చేయించుకుని సరి చేయించుకుంది. కథానాయికలకు ఎవరికైనా ఇది తప్పదని కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. దాంతో శ్రీదేవి.. నయనతార.. సమంతనే కాదు ఎవరైనా ఇంతేననేది ఆడియెన్ కి కూడా కనెక్టయ్యింది.అదంతా సరే కానీ.. శ్రుతిని ఏ కోణంలో చూసినా పాశ్చాత్య బాణీ మాత్రం మారదు. ఇంతకుముందు గబ్బర్ సింగ్ లో కనిపించిన భాగ్యలక్ష్మి నిజజీవితంలో అస్సలు కనిపించదు. పూర్తిగా వెస్ట్రన్ స్టైల్ నే ఈ అమ్మడు ఇష్టపడుతుంది. ఇదిగో లేటెస్టుగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ రౌడీ రాణి ఫోజుల్ని చూస్తేనే అర్థమవుతోంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ పక్కాగా చెప్పేస్తోంది తనలోని రౌడీతనాన్ని తగ్గనివ్వదని.

`మెటాలిక్` అన్న టైటిల్ ముద్రించిన బ్లాక్ టాప్ టీషర్ట్.. దానిపైన పుర్రె బొమ్మ చూస్తుంటేనే శ్రుతి ఎంత వెస్ట్రనో అర్థం చేసుకోవచ్చు. ఇక తన అందమైన దేహశిరులపై పచ్చబొట్లు అన్నీ ఇన్నీ కావు. మైఖేల్ కోర్సలేతో స్నేహం చేసాక ఆ పచ్చ బొట్టు ఇంకా ఎక్కువే అయ్యాయి డ్యామ్ షిట్ అనేలా. ఇక బ్రేకప్ తర్వాత వ్యవహారం తెలిసినదే. ఆ కుంకుడుకాయ బొడ్డున దోపిన చీర కుచ్చిళ్లకు ఆ టాప్ కి ఏమైనా సింకయ్యిందా? ప్చ్.. కాంబినేషన్ గా ఆ మెడలో లంబడోళ్ల చిన్నదిలా బిజిలీ టైపు అర్థరూపాయి బిళ్లలతో ఆ నెక్లెస్ చూశారా? ఆ చేతికి హెవీ వెయిట్ డిజైనర్ ఆభరణాలేమిటో.. అందుకేగా డ్యామ్ షిట్ శ్రుతి అన్నది. ఇంతకీ ఈ అమ్మడి `క్రాక్` ఎప్పటికి వచ్చేనో.. ఏమిటో!! అప్పటికి అభిమానులకు క్రాక్ పుడుతుందేమో!!