శ్రీయ పబ్లిక్ రొమాన్స్ హద్దు మీరుతోంది!

Wed Sep 22 2021 11:08:08 GMT+0530 (IST)

Shriyasaran has been having a romance in public

పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ గత కొంతకాలంగా శ్రీయశరణ్ - ఆండ్రూ జంట చేస్తున్న హడావుడి గురించి తెలిసిందే. శ్రీయ-ఆండ్రూ ఓపెన్ రొమాన్స్ సర్వత్రా చర్చనీయాంశమైంది. విదేశాల్లో అయినా.. స్వదేశంలో అయినా ఆ ఇద్దరు ఎక్కడా తగ్గడం లేదు. పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తున్నారు. వ్యవహారం అంతటితో ఆగడం లేదు. నిరంతరం ఘాటైన భంగిమలతో అలా జనం కళ్ల ముందే చెలరేగిపోవడం షాక్ నిస్తోంది.ఆ రొమాన్స్ తాలుకా..ఫోటోలు..వీడియోలు ఇన్ స్టా వేదికగా పాలోవర్స్ తో పంచుకోవడం ఆ దంపతులకే చెల్లింది. ఇప్పటికే శ్రియ బికినీ లో ఉండగా పూల్ సైడ్ శ్రియ థైస్ పై యాపిల్ పండ్లు కట్ చేయడం చర్చకు వచ్చింది. ఇట్స్ స్నాక్స్ టైమ్ అంటూ కొన్ని ఫోటోల్ని పబ్లిక్ లోకి వదిలింది. ఆ తర్వాత ముంబై వీధుల్లో విచ్చలవిడిగా ఇద్దరు ఫోటో షూట్లలో పాల్గొన్నారు. పబ్లిక్ గానే పెదవి ముద్దులతో వేడెక్కించారు.

తాజాగా ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి అదే వాణిజ్య రాజధాని నడిబొడ్డున శ్రీయ భర్తతో ఘాటైన రొమాన్స్ లో మునిగి తేలింది. ఆండ్రూ అలా పబ్లిగ్గా శ్రీయను గాల్లో ఎత్తి మరి రొమాన్స్ చేశాడు. ఉడుం పట్టు పట్టి.. శ్రియకు ఊపిరాడకుండా చేసాడు. ఈ ఫోటో ఓ కెమెరా కంటికి చిక్కింది. ఆ యాంగిల్ లో శ్రియ అందాలు ఓ రేంజ్ లో ఫోకస్ అయ్యాయి. ఆ ఫోటోని ఇన్ స్టా లో షేర్ చేసింది. దీంతో నెట్టింట వైరల్ గా మారడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. కొన్ని నిమిషాల్లోనే ఈ ఫోటో వైరల్ గా మారింది. గతంలో చాలా ఫోటోలు లీక్ చేసింది. కానీ వాటికి రాని రెస్పాన్స్ ఈ ఒక్క ఫోటోకి ధారాళంగా దక్కింది.

ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ ఒకప్పుడు ఊపేసిన భామ ఇప్పుడు కూడా క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` లో నటిస్తోంది. ఇందులో శ్రియ పాత్ర కీలకమైనదిగా తెలుస్తోంది. అలాగే `గమనం` అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. ఇంకా కోలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. పెళ్లైనా ఇంత విరివిగా అవకాశాలు అందుకోవడం కూడా శ్రియకే చెల్లింది. చాలా మంది భామలు పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైతే..శ్రియ మాత్రం లైఫ్ ని మరింత కలర్ ఫుల్ గా మలుచుకుంటోంది.