శ్రీయ స్కూల్లో ఫేమస్ సింగర్!

Thu Oct 14 2021 07:00:01 GMT+0530 (IST)

Shriya lead role In the Magic School

శ్రీయ ప్రధాన పాత్రలో ఇళరాజా సంగీత సారథ్యంలో పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తోన్న చిత్రం `మ్యూజిక్ స్కూల్`. ఇందులో శ్రియ మ్యూజిక్ స్కూల్ టీచర్ పాత్రలో కనిపించనుంది. తెలుగు-హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మంచి కంటెంట్ బేస్డ్ సినిమా కావడం ఇళయరాజా లాంటి సంగీతం దిగ్గజం పనిచేయడంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రఖ్యాత గాయకుడు షాన్ కూడా భాగమవుతున్నారు. ఇందులో షాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన నటుడిగా...గాయకుడిగా కనిపించనున్నారు. అయితే షాన్ పాత్ర మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది.ఇందులో షాన్ శ్రియ పాత బోయ్ ప్రెండ్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రియ గతం ఎక్కువగా ఆయన పాత్ర చుట్టూనే తిరిగుతుందిట. అలాగే ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కు షాన్ గాత్రం కూడా అందించడంతో సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ఈ సందర్భంగా షాన్ మాట్లాడుతూ..`ఇళయరాజా సంగీతం అందిస్తోన్న చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉంది. సినిమా థీమ్ బాగా నచ్చి నటిస్తున్నాను. నేటి యువతకు చక్కని సందేశాన్ని` ఇస్తుంది అని అన్నారు. ఇక చిత్ర దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ.. `ఇళయరాజా స్టూడియోలో షాన్ పాడటం చూసి ఒక నిమిషం పాటు అలా తన్మయం లో ఉండిపోయాను. గాయకుడిగా షాన్ కొన్ని సంవత్సరాలుగా శ్రోతల్ని అలరిస్తున్నారు. ఆయనకు ఈ సినిమా మరింత మంచి పేరు తీసుకొస్తుందని` అన్నారు.

పాపారావు న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ విద్యార్ధి. గతంలో `విల్లింగ్ టు త్యాగం` అనే ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇది జాతీయ..రెండు అంతర్జాతీయ అవార్డుల్ని సైతం అందుకుంది. ఇందులో బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి కూడా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్..బ్రహ్మానందం వినయ్ వర్మ...గ్రేసీ గోస్వామి.. సుహాసిని ములాయ్.. ఓజు బారు తదిరతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ అంతా హైదరాబాద్ ..గోవాల్లో ఉంటుంది. అక్టోబర్ 15న చిత్రం ప్రారంభం కానుంది.