వర్కౌట్ టైంలో భర్తతో కొంటె సరసం.. హీరోయిన్ వీడియో వైరల్!

Wed Jun 09 2021 17:01:27 GMT+0530 (IST)

Shriya Saran Latest Work Out Video Goes Viral

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన శ్రీయ శరన్ కొన్నేళ్ల పాటు గ్లామర్ షోతో ఆకట్టుకుంది. ఈ వయ్యారి భామ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని హిట్స్ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. కొందరు హీరోయిన్లు ఎన్నేళ్లు గడిచినా అదే అందంతో ప్రేక్షకుల మనసుల్లో వారి స్థానం అలాగే కాపాడుకుంటారు. అలాంటి వయ్యారి భామల్లో శ్రీయ తప్పకుండా ఉంటుంది. దాదాపు 20ఏళ్లుగా అమ్మడు తన అందాలతో చిత్రపరిశ్రమను షేక్ చేస్తోంది. కానీ ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ 38ఏళ్ల సుందరి తన భర్తతో వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తుంది.ఇండస్ట్రీలో  కెరీర్ పరంగా అన్నిరంగాలలో రాణించిన శ్రీయ.. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలలో గ్లామర్ బ్యూటీగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే కొద్దీకాలం క్రితం రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూని పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం వైవాహిక జీవితంతో పాటు సినిమా లైఫ్ కూడా కంటిన్యూ చేస్తోంది. అప్పుడప్పుడు తాను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అందుకే నిత్యం వార్తలలో నిలుస్తుంది ఈ స్టార్ బ్యూటీ. పెళ్లయ్యాక సినిమాలు కాస్త తగ్గించింది శ్రీయ. కానీ అడపాదడపా పలు సినిమాలలో మెరుస్తూనే ఉంది. ప్రస్తుతం భర్తతో కలిసి ఫుల్లుగా షికారు చేసేస్తోంది.

అయితే శ్రీయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. అందుకే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో వీడియోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీయ వర్కౌట్ చేస్తుండగా.. ఆమె భర్త వీడియో తీస్తున్నాడు. ఇక భర్త చూస్తున్నాడు కదా అని అమ్మడు వెనక్కి తిరిగి కెమెరా వైపు బ్యాక్ చూపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వర్కౌట్ సమయంలో కూడా అమ్మడు భర్తతో కొంటె సరసం ఆడుతుందని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు. మొన్నామధ్యలో తన భర్తతో కలిసి లిప్ కిస్ వీడియో షేర్ చేసి షాకిచ్చింది. భర్తతో గాడంగా చుంబనంలో మునిగి తేలుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ప్రస్తుతం అమ్మడు ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరవనున్నట్లు సమాచారం.