Begin typing your search above and press return to search.

కంగ‌న ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా..?

By:  Tupaki Desk   |   6 March 2021 2:30 PM GMT
కంగ‌న ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా..?
X
పాశ్చాత్య ధోర‌ణితో నేటిత‌రం చెల‌రేగుతున్న తీరును ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసిన కంగ‌న‌పై ట్రోల్స్ గురించి తెలిసిందే. ఇంత‌కీ కంగ‌న ఏమ‌ని అంది? అంటే.. అస‌లు ఈ చినుగుల జీన్స్ క‌ల్చ‌ర్ ని మ‌నం అమెరికా నుంచి దిగుమ‌తి చేసుకున్నాం. ఇది చెత్త క‌ల్చ‌ర్.. భార‌తీయ‌త లేనే లేదు! అంటూ విమ‌ర్శించింది. దీనికి హ‌ర్ట‌యిన యూత్ ఇంత‌కుముందు కంగ‌న చినుగుల జీన్స్ తొడుక్కున్న ఫోటోల్ని షేర్ చేసి కౌంట‌ర్లు వేశారు.

అదంతా స‌రే కానీ.. అందాల సౌత్ హీరోయిన్ శ్రీయ‌ను ఇలా చినుగుల డెనిమ్ లో చూస్తే కంగ‌న ఏమ‌ని అంటుందో క‌దా? ఆ చినుగుల జీన్స్ పై ఒక రేంజులోనే ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. పైగా విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడాక శ్రీ‌య ఇంత‌కుమించి చెల‌రేగిపోతోంది.

హ‌బ్బీతో క‌లిసి ప్ర‌పంచ వింత‌ల‌న్నిటినీ విజిట్ చేస్తున్న శ్రీయ ఇంత‌కుముందు మ‌చు పిచ్చు (పెరూ) స్పాట్ ఉంచి ఒక అంద‌మైన వీడియోని షేర్ చేసింది. భ‌ర్త ఆండ్రూతో రొమాంటిక్ ఫోజుల్ని కూడా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. శ్రీ‌య బోల్డ్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసే ఫోటోలు ఇన్ స్టా వేదిక‌గా వైర‌ల్ అయ్యాయి.

ఇదిగో వాటిలోంచి ఈ త్రోబ్యాక్ ఫోటో మ‌రోసారి యువ‌త‌రంలో కాక‌లు పుట్టిస్తోంది. బ్లూ డెనిమ్ పింక్ జీన్స్.. బ్రింజాల్ క‌ల‌ర్ టాప్ తో శ్రీయ రెబ‌ల్ లా క‌నిపిస్తోంది. ఆయిలీ టోన్డ్ బాడీతో యూత్ గుండెల్ని మీటుతోంది. ఇక ఇదే దూకుడుతో టాలీవుడ్ లోకి కంబ్యాక్ అవుతుందేమో చూడాలి.