#లిప్ లాక్.. అవార్డ్ వేదికల్ని వదలని శ్రీయ!

Sat Oct 23 2021 12:05:34 GMT+0530 (IST)

Shreya Liplock Scene In Award Function

పబ్లిక్ ఉన్నా.. మీడియా కనిపించినా ఈ జంట హద్దులు చెరిపేసి చెలరేగిపోతోంది. ఏమాత్రం అవకాశం దొరికినా లిప్ లాక్  లు కౌగిలింతలతో హీటెక్కిస్తోంది. అంతమంది జనం ముందు హాలీవుడ్ స్టార్లనే కొట్టేసేలా శ్రీయ - కోశ్చీవ్ జంట విన్యాసాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.అసలు భయం లేదు.. బెరుకు లేదు.. సిగ్గు అసలే లేదు! మొహమాటానికైనా కాస్త జంకే సన్నివేశం అసలే కనిపించడం లేదు. తాజాగా ఓ అవార్డ్ ఈవెంట్లో శ్రీయ తన భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో లిప్ లాక్ వేసి హీటెక్కించింది. పబ్లిక్ పార్కుల్లో విహారయాత్రల్లో ఇలాంటి విన్యాసాలతో ఇప్పటికే కెమెరా కంటికి దొరికిపోయిన ఈ జంట ఇప్పుడు సెలబ్రిటీలను షాక్ కి గురి చేస్తూ అలా పబ్లిగ్గా పెదవి ముద్దులాడేయడం చర్చకు వచ్చింది. జీ-తెలుగు కుటుంబ అవార్డ్స్ ఇందుకు వేదిక అయ్యింది. నిజానికి ఆ సందర్భంలో ఆండ్రూ చాలా సాధారణంగా శ్రీయ బుగ్గపై ఒక పెక్ ఇచ్చాడు. కానీ శ్రీయ మాత్రం అతడి పెదవిని అందుకుని ఘాడంగా చుంబించేయడం సడెన్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. అప్పటివరకూ షో అంత స్పైసీగా కనిపించకపోయినా ఈ జంట వేదికపైకి ఆరంగేట్రం చేయగానే ఒకటే గిలిగింతలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆండ్రూ ఎంత డీసెంట్ గా ఉన్నాడో శ్రీయ అంత చిలిపిగా రెచ్చిపోవడం చూస్తుంటే ఏంటిదీ! అంటూ కొందరు గుసగుసలు ఆడారు.

మ్యాడమ్ మరీ ఇంతగా చెలరేగిపోవాలా? అంటూ అభిమానులు ఆ దృశ్యానికి స్టన్నయిపోయారంతే. పబ్లిక్ కనిపిస్తే చాలు శ్రీయ ఇలా రెచ్చిపోవడంపైనా ఇప్పుడు మరోసారి వేడిగా చర్చ సాగుతోంది. ఇక ఇటీవల ముంబైలో సెటిలైన ఈ జంట అక్కడ వ్యాపారాల్ని విస్తరించే ప్రణాళికలో ఉన్నారు. హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగు -తమిళ సినిమాల్లో నటించేందుకు శ్రీయ భారీ ప్రణాళికలను కలిగి ఉంది.

కూతురు రాధతోనే తీరిక సమయం..

ఓవైపు లైఫ్ లో బోల్డ్ నెస్ ని ఆవిష్కరిస్తూనే.. హబ్బీతో ఎంజాయ్ చేయడమే గాక కుమార్తె ఆలనాపాలనలోనూ శ్రీయ సేద దీరుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో శ్రీయ ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు తన గర్భధారణ వార్తలను బయటకు ప్రచారం చేయలేదు. ఇటీవలే తన శిశువును పరిచయం చేసింది శ్రీయ. భర్తతో కలిసి తన బిడ్డను ఎత్తుకుని ఉన్న ఓ ఫోటోని షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. తాజా చాటింగులో తన కుమార్తె గురించి మరింత వెల్లడించింది. తన కుమార్తె తొమ్మిది నెలల క్రితం జన్మించిందని శ్రియ చెప్పింది. ఆమె స్పెయిన్ -బార్సిలోనాలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త ఆండ్రీ కోశ్చీవ్ కుమార్తెకు రాధ అని పేరు పెట్టారు. ``రాధ నా బెస్ట్ ఫ్రెండ్ ..నా ప్రపంచం`` అంటూ శ్రీయ ఎమోషనల్ అయ్యింది. నా కుమార్తె ఎదుగుతోంది. ఇక దాచలేనని శ్రియ చెప్పింది. రాధతో ప్రతిచోటికి వెళ్లాల్సి వస్తోందని తన వెంటే ఉండాల్సొస్తోందని శ్రీయ తెలిపింది. శ్రియ నటించిన సినిమాలు వరుసగా రిలీజవుతున్నాయి. తదుపరి విడుదలకు రెడీ అవుతున్న `గమనం`.. `RRR` లను ప్రమోట్ చేసేందుకు శ్రీయ సిద్ధమవుతోంది. 2018 లో శ్రియ ఆండ్రూని వివాహం చేసుకుంది. ఆండ్రూ యూరప్ లో పెద్ద బిజినెస్ మేన్ అన్న సంగతి తెలిసిందే. అక్కడ బిజినెస్ వ్యవహారాలు చక్కబెడుతూనే ఇక్కడ శ్రీయ రెండో ఇన్నింగ్స్ కోసం  బోలెడంత సహకారం అందిస్తున్నాడు ఆండ్రూ. ఈ జంట అన్యోన్య దాంపత్యం ఇటీవల సర్వత్రా చర్చనీయాంశమైంది.