Begin typing your search above and press return to search.

అదృష్టం అంటే ఈ అమ్మడిదే

By:  Tupaki Desk   |   21 Feb 2020 6:45 AM GMT
అదృష్టం అంటే ఈ అమ్మడిదే
X
హీరోయిన్స్‌ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేరు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే కొందరి విషయంలో మాత్రం అది నిజం కాదేమో అనిపిస్తుంది. శ్రియ.. త్రిష వంటి హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా కూడా వీరిద్దరు హీరోయిన్స్‌ గా హీరోలతో రొమాన్స్‌ చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం వీరితో ఎంట్రీ ఇచ్చిన వారు వీరి తర్వాత ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఆంటీల పాత్రలకు పరిమితం అయ్యారు లేదంటే ఇండస్ట్రీని వదిలి వెళ్లి పోయారు.

శ్రియ కెరీర్‌ కంప్లీట్‌ అంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి ఈమెకు మళ్లీ మళ్లీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కెరీర్‌ పై ఆశలు వదిలి పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈమెకు ఆఫర్లు తలుపు తడుతూనే ఉన్నాయి. వరుసగా కాకున్నా సంవత్సరానికి ఒకటి రెండు అయినా పెద్ద సినిమాల్లో నటించే ఛాన్స్‌ వస్తుంది. ప్రస్తుతం ఈఅమ్మడు రెండు సినిమాలకు కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.

బాలయ్య.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న సినిమాకు పలువురు హీరోయిన్స్‌ ను సంప్రదించి చివరకు శ్రియను ఫైనల్‌ చేశారట. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ కావాల్సి ఉండగా ఒక హీరోయిన్‌ గా శ్రియను దాదాపుగా ఖరారు చేశారట. ఇక మరో సినిమాలో కూడా శ్రియకు ఛాన్స్‌ వచ్చింది. రాజశేఖర్‌ హీరోగా రూపొందబోతున్న ఒక భారీ యాక్షన్‌ డ్రామా చిత్రంలో ఈమెను హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా ఈమెకు ఛాన్స్‌ లు వస్తున్నాయి. త్వరలో ఒక వెబ్‌ సిరీస్‌ కు సైన్‌ చేసే అవకాశం కనిపిస్తుంది. నాలుగు పదుల వయసు దగ్గరకు వచ్చినా కూడా ఇంకా హీరోయిన్‌ గా ఆఫర్లు వస్తున్నాయంటే అదృష్టం అంటే ఈ అమ్మడిదే అంటూ నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.