'క్షణక్షణం' ను 267 సార్లు చూసిందట

Sun Apr 18 2021 13:41:55 GMT+0530 (IST)

Shreya Dhanwanthary watched kshana kshanam movie 267 times

రామ్ గోపాల్ కెరీర్ ఆరంభంలో అద్బుతమైన సినిమాలను ఆవిష్కరించాడు. టాలీవుడ్ కు దిశ నిర్ధేశం చేసే సినిమాలు ఆయన నుండి వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన సినిమా 'శివ' ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన మరో సినిమా 'క్షణ క్షణం'. వెంకటేష్ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవడంతో పాటు ఇప్పటికి ఎంతో మందికి ఫేవరేట్ చిత్రంగా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. శ్రీదేవి కోసం ఈ సినిమాను చేశానంటూ చాలా సందర్బాల్లో రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. శ్రీదేవిని అప్పటి వరకు ఇతర దర్శకులు చూపించినట్లుగా కాకుండా చాలా విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. అలాంటి క్షణక్షణం సినిమా తన ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమా అంటూ శ్రేయ ధన్వంతరి సోషల్ మీడియాలో షేర్ చేసింది.తెలుగులో 'జోష్' సినిమాలో కనిపించిన శ్రేయ ధన్వంతరి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తూ వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. హీరోయిన్ గా మళ్లీ ఆఫర్లు దక్కించుకుంటూ వస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమా అంటూ క్షణ క్షణం గురించి చెప్పుకొచ్చింది. ఆ సినిమా ను ఆకాశానికి ఎత్తిన శ్రేయ ధన్వంతరి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

క్షణక్షణం సినిమాను ఇప్పటి వరకు 267 సార్లు చూసినట్లుగా ఆమె ట్వీట్ చేసింది. మళ్లీ నా అభిమాన తెలుగు సినిమా క్షణక్షణంను చూస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. వెంకటేష్ గారు.. శ్రీదేవి గారు.. రామ్ గోపాల్ వర్మ గారు ది బెస్ట్ అన్నట్లుగా ట్వీట్ చేసింది. శ్రేయ ధన్వంతరి ట్వీట్ కు నెటిజన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు. అంత కరెక్ట్ గా 267 సార్లు అంటూ ఎలా చెబుతున్నారు మేడమ్ గారు. చూసిన ప్రతి సారి లెక్కించుకుంటూ వస్తున్నారా. 267 సార్లు కూడా సినిమాను పూర్తి గా చూశారా అంటూ మరి కొందరు చెబుతున్నారు. ఇక మరి కొందరు ఫన్నీగా వర్మ తీసిన సినిమా అర్థం కాక అన్ని సార్లు చూస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.