పెళ్లికి ముందు అదేం తప్పు కాదన్న వర్మ హీరోయిన్

Sun Jul 05 2020 18:00:01 GMT+0530 (IST)

Shree Rapaka About Her Personal Life

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన డిజిటల్ మూవీ ఎన్‌ఎన్‌ఎన్ లో హీరోయిన్‌గా నటించిన స్వీటీ అలియాస్ శ్రీరాపాక గత రెండు మూడు రోజులుగా వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీడియాలో ఈమె ఇంటర్వ్యూలు తెగ హడావుడి చేస్తున్నాయి. తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుని ఔనా అంటూ అంతా నోరు వెళ్లబెట్టేలా చేసిన శ్రీ తాజాగా పెళ్లికి ముందు శృంగారం విషయంలో సెన్షేషనల్ కామెంట్స్ చేసింది.వర్మ తీసిన బోల్డ్ చిత్రంలో నటించిన శ్రీ తాజాగా ఈ విషయంలో అంతే బోల్డ్ గా స్పందించింది. చాలా మంది పెళ్లికి ముందు అది కరెక్ట్ కాదంటారు. కాని తన ఉద్దేశ్యంలో పెళ్లికి ముందు శృంగారం తప్పనిసరి అంటూ శ్రీ రాపాక అంది. అందుకు సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్పింది. డాక్టర్ చదివిన తన ఒక స్నేహితురాలు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత మొదటి రాత్రి రోజు అతడు గే అని తేలింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమెను పెళ్లి చేసుకున్నాడట.

ఒక డాక్టర్ విషయంలో అది జరిగింది. అదే సామాన్యుల విషయంలో అలా జరిగితే పరిస్థితి ఏంటీ అనేది శ్రీ ప్రశ్న. అందుకే పెళ్లికి ముందు అన్ని విషయాలు తెలుసుకున్నట్లుగా ఆ విషయాన్ని కూడా తెలుసుకుంటే తప్పేముంది అంటూ వర్మ రేంజ్ లో చాలా బోల్డ్ గా ఈ అమ్మడు మాట్లాడుతూ ఉంది. ఈ విషయంపై కొందరు నెటిజన్స్ శ్రీపై విమర్శలు గుప్పిస్తున్నారు.