Begin typing your search above and press return to search.

నెట్టింట నాని హీరోయిన్ ఎందుకంత ఫైర్ అవుతోంది..?

By:  Tupaki Desk   |   11 July 2020 3:30 AM GMT
నెట్టింట నాని హీరోయిన్ ఎందుకంత ఫైర్ అవుతోంది..?
X
గతేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా విడుదలైన 'జెర్సీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి కాస్త డేరింగ్ ఎక్కువేనట. షూటింగ్ సెట్ లో కూడా డేరింగ్ గా ఉంటుందట. ఇటీవలే అమ్మడి రెండో తెలుగు సినిమా 'కృష్ణ అండ్ హిస్ లీల" విడుదలైంది. అది కూడా థియేటర్లో కాదు.. నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో. క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ టాల్ హీరో రానా నిర్మించడం విశేషం. అయితే సినిమా ఫలితం గురించి పక్కన పెడితే.. తాజాగా అమ్మడు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా విరుచుకు పడింది.

ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడే ప్రశ్నలను సంధించింది. తన ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటుంది. శ్రద్ధా ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పెళ్లయ్యాక ఇండస్ట్రీలో హీరోయిన్ల పై చిన్నచూపు అలాగే ఉందంటుంది. పెళ్ళైతే హీరోయిన్లు సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి పనికిరారా.. అంటూ అడుగుతోంది. శ్రద్ధ అలా అడగటంలో అర్థం ఉందని కొందరు అంటుంటే.. పెళ్ళైతే వేరే హీరోతో ఎలా రొమాన్స్ చేస్తారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు శ్రద్ధ ఎందుకు ఫైర్ అవుతోంది అంటే.. తన నటి ఫ్రెండ్ ఒకరు త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. పెళ్లి తర్వాత నీ ఫ్రెండ్ నటిస్తోందా లేదా..

అని ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అడిగాడట. ఆ మాటకి అమ్మడు షాక్ తిన్నదట. వెంటనే కోపం వచ్చినా ఆపుకొని ఆలోచించిందట. "పెళ్లయ్యాక హీరోయిన్లకు నిజంగా డిమాండ్ తగ్గుతుందా..? మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక శ్రద్ధ పోస్ట్ చూసిన నెటిజన్లు స్పందించడం మొదలుపెట్టారు. నెటిజన్లతో పాటు కన్నడ నటి హిత కూడా మద్దతు పలికింది. ఆమెకు కూడా పలుమార్లు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనట్లు తెలిపింది. అవును ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య అందరూ హీరోయిన్లకి జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి శ్రద్ధ చర్చ ఎంతటి వరకు దారితీస్తుందో..!!