Begin typing your search above and press return to search.

`సాహో` బ్యూటీ న‌గ్నంగా న‌టిస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   9 Aug 2020 3:45 AM GMT
`సాహో` బ్యూటీ న‌గ్నంగా న‌టిస్తుంద‌ట‌!
X
అమ‌లాపాల్ న‌టించిన `ఆమె` తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆడై పేరుతో త‌మిళంలోనూ బంప‌ర్ హిట్ కొట్టింది. రోడ్లు.. పార్కుల్లో ప్ర‌జ‌ల‌ను ప్రాంక్ చేయ‌బోయి తానే ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయే మీడియా అమ్మాయిగా అమ‌లాపాల్ అద్భుతంగా న‌టించింది. సినిమా ఆద్యంతం ఒంటిపై నూలు పోగైనా లేకుండా న‌గ్నంగా కనిపించాల్సిన స‌న్నివేశంలో ఆ లేడీ టీవీ రిపోర్టర్ (ఆమె) ఏం చేసింది? అన్న‌ది ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్ ప్ర‌తిభావంతంగా తెర‌పై చూపించారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అమల పాల్ పాత్ర‌లో శ్రద్ధ కపూర్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. సినిమా ఆద్యంతం కేవ‌లం ఒకే ఒక్క పేలిక లాంటిది ఒంటిపై క‌ప్ప‌కుని శ్ర‌ద్ధ క‌నిపించ‌నుంది.

డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన శ్ర‌ద్దా క‌పూర్ కి తెలుగులోనూ అభిమానులేర్ప‌డ్డారు. తాజాగా ద‌క్షిణాది మూవీ రీమేక్ లో న‌టించేందుకు ఈ అమ్మ‌డు ఆస‌క్తిని చూపించ‌డం చూస్తుంటే సౌత్ పై మ‌రింత ఆస‌క్తిగా ఉన్న‌‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న శ్ర‌ద్ధా మునుముందు తెలుగులో మ‌రిన్ని సినిమాల్లో న‌టిస్తుందేమో చూడాలి. భాఘి 3 .. చిచ్చోరే సినిమాల త‌ర్వాత ఈ అమ్మ‌డు ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. అయితే మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వ‌ల్ల వాటిని ప్ర‌క‌టించ‌లేద‌ని స‌మాచారం.