Begin typing your search above and press return to search.

సాహో శ్ర‌ద్ధా .. రేయింబ‌వ‌ళ్లు అదే ప‌ని..!

By:  Tupaki Desk   |   20 Feb 2020 8:00 AM GMT
సాహో శ్ర‌ద్ధా .. రేయింబ‌వ‌ళ్లు అదే ప‌ని..!
X
2010 లో `తీన్ పతి` చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్ర‌ద్ధా క‌పూర్. బ్లాక్ బస్టర్ చిత్రం `ఆషిఖి 2` తో స్కై ఈజ్ లిమిట్ అనేంత‌గా దూసుకెళ్లింది. ఆ తరువాత ఏక్ విలన్- హాఫ్ గర్ల్ ఫ్రెండ్- స్ట్రీ- చిచోర్- ఎబిసిడి 2- స్ట్రీట్ డ్యాన్స‌ర్ చిత్రాల్లో ప్ర‌తిభ‌ను ఆవిష్క‌రించుకుంది. ఇక ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా సాహో చిత్రంలో న‌టించి డార్లింగ్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయిన‌ సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ భామ టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న `భాగి 3`లో నటించింది. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ముంబైలోని ఓ డ‌బ్బింగ్ స్టూడియో నుండి బయటికి వెళుతూ శ్రద్ధా తాజాగా కెమెరా కంటికి చిక్కింది. అప్పుడే డబ్బింగ్ సెషన్ పూర్తి చేసుకుని వెళుతున్న‌ట్టుంది. అలా వెళ్లేప్పుడు ఎంతో సింపుల్ గా.. వైట్ డ్రెస్ తొడుక్కుంది. వైట్ ట్యాంక్ టాప్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షించింది. బాలీవుడ్ లో రౌండ్ ది క్లాక్ హార్డ్ వ‌ర్క్ చేసే స్టార్ గా శ్ర‌ద్ధాకి పేరుంది. ఇప్పుడు భాగి 3ని హిట్ చేయ‌డ‌మే ధ్యేయంగా శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంది.

భాగి2లో టైగర్ ష్రాఫ్ తో శ్ర‌ద్ధా ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కుర్ర‌కారుకు పిచ్చిగా క‌నెక్ట‌య్యింది. ఇప్పుడు పార్ట్ 3లో ఈ జోడీ ఎలా క‌నిపించ‌నుందో చూడాల‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ భారీ యాక్ష‌న్ సినిమాని సైబీరియాలో మెజారిటీ భాగం చిత్రీక‌రించారు. ఇందు లోనే టైగ‌ర్ మాజీ ప్రేయ‌సి దిశా ప‌టానీ అదిరి పోయే స్పెష‌ల్ నంబ‌ర్ లో న‌ర్తించింది. మార్చి 6న సినిమా థియేటర్లలోకి విడుదల కానున్న ఈ చిత్రం తమిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `వెట్టై`కి అధికారిక రీమేక్. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు.