ఫోటో స్టొరీ: మియావ్.. పిల్లితో మోడరన్ పాప

Thu Sep 19 2019 12:03:29 GMT+0530 (IST)

Shraddha Kapoor Playing with Cat

బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ. 'సాహో' ద్వారా మొదటి సారి ఒక సౌత్ సినిమాలో నటించింది కానీ హిందీలో ఈ బ్యూటీకు మంచి పాపులారిటీ ఉంది.  బయట అడుగు పెడితే చాలు మీడియా ఫోకస్ ఉంటుంది.  ఫోటోలు తీయడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వెంటవెంటనే జరిగే పనులు. రీసెంట్ గా అలానే జరిగింది.శ్రద్ధ నిన్న ముంబైలో ఒక డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వస్తూ కనిపించింది. దీంతో ఫోటోగ్రాఫర్లు ఆ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తమ కెమెరాలకు పని చెప్పారు.  వైట్ కలర్ టాంక్ టాప్..  డెనిమ్ షార్ట్ తో శ్రద్ధ సూపర్ స్టైలిష్ గా కనిపించింది. అయితే నడుచుకుంటూ వచ్చి తన కారు ఎక్కేలోపు అక్కడ ఒక మార్జాలము.. బిడాలము కనిపించింది.  అంటే ఏంటి అనుకోకండి.. పిల్లిని కొంచెం గ్రాంధిక తెలుగులో అలా రెండు రకాలుగా అంటారు.  ఇది గురువారం జ్ఞానం అనుకోండి!  టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతోంది కాబట్టి మళ్ళీ పిల్లి దగ్గరకే వెళ్దాం.  ఆ పిల్లిని చూసిన శ్రద్ధ ఓస్.. పిల్లే కదా అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు.  ఆ పిల్లి దగ్గరకు పోయింది. దాని వీపుపై చేతిని వేసి ప్రేమగా నిమిరింది. పిల్లి కావడంతో దానికి పెద్దగా జ్ఞానం లేదు.. నిమిరిన వ్యక్తి శ్రద్ధా కపూరా.. సీరత్ కపూరా అనేది అది పట్టించుకోలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయింది..  శ్రద్ధ ఎంచక్కా వచ్చి తన కారెక్కింది.  ఇక బాలీవుడ్ మీడియాలో 'పిల్లిని ప్రేమగా నిమిరిన శ్రద్ధ' అనే హెడ్ లైన్స్ వచ్చాయి. ఇంపార్టెంట్ న్యూస్ నో...!

పిల్లిని ప్రేమగా నిమరడాలు.. ఫోటోలకు నవ్వుతూ పోజివ్వడం కాకుండా శ్రద్ధ ఏ సినిమాల్లో నటిస్తోంది అని అడిగితే 'స్ట్రీట్ డ్యాన్సర్ 3D' అనే చిత్రంలో నటిస్తోంది. డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరో.