సాహో బ్యూటీ నిక్కరులో నాటీగా!

Thu Oct 10 2019 22:18:36 GMT+0530 (IST)

Shraddha Kapoor Glamourous Pose

2018లో నాలుగు చిత్రాల్లో నటించింది. 2019లో అరడజను సినిమాలు అమ్మడి క్యూలో ఉన్నాయి. ఇప్పటికే రెండు రిలీజై బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి. సాహో.. చిచ్చోర్ చిత్రాలతో బంపర్ హిట్లు అందుకుని ఆ ఉత్సాహంలో తదుపరి షెడ్యూల్స్ తో బిజీ అయిపోయింది. అయితే ఇంత బిజీలోనూ ఇదిగో ఇలా వీధుల్లో షికార్లు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.ఫ్యాషన్ అండ్ స్టైల్స్ లో తన రేంజు వేరని మరోసారి ప్రూవ్ చేసింది శ్రద్ధా. లేటెస్ట్ ఔటింగ్ లో లూజ్ వైట్ టాప్.. లైట్ బ్రౌన్ షార్ట్ లో కనిపించింది. మ్యాచింగ్ చెప్పల్స్ ని ధరించింది. ఇదిగో ఇలా స్మైల్ ఇస్తూ కుర్రకారు గుండెలకు చిల్లు పెట్టేసింది. థై సౌందర్యం ఎలివేట్ చేసే ఆ చిట్టి పొట్టి షార్ట్ ఆ వైట్ గౌను మీదుగా భుజానికి వేలాడదీసిన చారల బ్యాగ్ ... ఇస్టయిల్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఒకటే కామెంట్లు చేస్తున్నారు.

2010లో `తీన్ పత్తి` అనే చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది శ్రద్ధా. ఆ తర్వాత ఆషిఖి 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. 2013 నుంచి ఇప్పటివరకూ అసలు క్షణం తీరిక అన్నదే లేకుండా గడిపేసింది. ఏక్ విలన్- హాఫ్ గర్ల్ ఫ్రెండ్- స్త్రీ- ఏబీసీడీ 2 వంటి బ్లాక్ బస్టర్లలో నటించింది. ఒక్కో చిత్రానికి 5-6 కోట్లు పైగానే పారితోషికం అందుకుంటోంది. ఏడాదికి 20కోట్ల సంపాదనతో బాప్ రే అనిపిస్తోంది.