Begin typing your search above and press return to search.

వేశ్యగా ఈమెను చూసి అవాక్కవ్వాల్సిందేనట

By:  Tupaki Desk   |   21 Feb 2020 5:30 AM GMT
వేశ్యగా ఈమెను చూసి అవాక్కవ్వాల్సిందేనట
X
హీరోయిన్‌ గా పరిచయం అయిన శ్రద్దా దాస్‌ కాలం కలిసి రాకపోవడంతో హీరోయిన్‌ గా కొనసాగలేక పోయింది. హీరోయిన్‌ గా ఛాన్‌ లు రాకపోవడంతో ఈ అమ్మడు వరుసగా ఐటెం సాంగ్స్‌ చేస్తూ కుర్రకారుకు మతెక్కించే పనిలో బిజీ అయ్యింది. వరుసగా వ్యాంప్‌ పాత్రలు చేయడం.. ఐటెం సాంగ్స్‌ చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటో షూట్స్‌ వదులుతూ ఉండటం వల్ల ఈమెను ఇంకా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు.

చాలా కాలం తర్వాత ఒక మంచి ఆఫర్‌ వచ్చిందని.. దాంతో మళ్లీ తానేంటో నిరూపించుకుంటానంటూ ఈ అమ్మడు ఛాలెంజ్‌ చేస్తోంది. జగపతిబాబు కీలక పాత్రల్లో విద్యాసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ అమ్మడు వేశ్యగా కనిపించబోతుందట. ఇప్పటి వరకు తెలుగు స్క్రీన్‌ మీద ఎంతో మంది వేశ్యలను చూసి ఉంటారు. కాని ఈమె చాలా ప్రత్యేకం అన్నట్లుగా ఉంటుందట. వేశ్య పాత్రకే అందం తీసుకు వచ్చింది అన్నట్లుగా ఈమెపై ప్రశంసలు కురిసేలా ఆ సినిమాలో ఈమె పాత్ర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమాలో హీరోయిన్‌ కు తక్కువ క్యారెక్టర్‌ ఆర్టిస్టు కు ఎక్కువగా ఈమె కనిపిస్తుందని.. కనుక ఈ అమ్మడికి ఈ సినిమాతో మళ్లీ మూడు నాలుగు సినిమాల్లో అయినా ఆఫర్లు వస్తాయనే నమ్మకంగా ఉందట. మరి ఈ అమ్మడి నమ్మకం నిలిచేనా లేదంటే మళ్లీ హాట్‌ ఫొటో షూట్స్‌ తో కాలం వెళ్లదీయాలో చూడాలి.