చీరలో హొయలొలికించడంలో Phd చేసిందిగా!

Sun Jul 03 2022 21:00:01 GMT+0530 (IST)

Shraddha Das Latest Photo

ఓవైపు పెద్ద తెర అవకాశాలు తగ్గాయి. అదే క్రమంలో బుల్లితెరను ఆశ్రయిస్తున్న నటీమణుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఇందులో శ్రద్ధా దాస్ పేరు కూడా చేరింది. సదరు బెంగాళీ నటి ఆర్య2 సినిమాలో  వ్యాంప్ తరహా పాత్రలో నటించినా కానీ ఆ తర్వాత కథానాయికగా  కొన్ని సినిమాల్లో నటించింది. ఇంతకుముందు గుంటూరోడులో హీటెక్కించే లుక్ తో యాక్షన్ రాణిగా కనిపించి మెప్పించింది.



ఇప్పుడు బుల్లితెరపై  వచ్చీ రాని తెలుగులో జడ్జిమెంట్ ఇస్తుంటే నవ్వుకునే వాళ్లకు కొదవేమీ లేదు. ఏదేమైనా టీవీ స్క్రీన్ పైకి ఈ భామ రాక కొంత గ్లామర్ ని అద్దిందనే చెప్పాలి. అక్కడ చీర కట్టులో తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తున్న ఈ బెంగాళీ బ్యూటీ బోలెడన్ని నవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల గుండెల్ని గిచ్చేస్తోంది.

తాజాగా శ్రద్ధా కపూర్ శారీ లుక్ అంతర్జాలంలో గుబులు రేపుతోంది. అలా స్వేచ్ఛగా అందాలను కెమెరా ముందు ఆరబోయడమెలానో ఈ అమ్మడినే అడగాలి. చీర రవికెలో కూడా ఎంతో హాట్ గా ఇంప్రెస్సివ్ గా నవ్వేస్తూ గుండెలు కొల్లగొట్టేస్తోంది. కాస్త ఓల్డ్ క్లాసిక్ డేస్ ని తలపించే డిజైనర్ చీరలో శ్రద్ధా ఎంతో అందంగా కనిపిస్తోంది. అలాగే ఢీ 3 డ్యాన్స్ రియాలిటీ షో జడ్జిగా శ్రద్ధా ఎంతో ఆకట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ లో లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్ కూడా అతిథిగా కనిపించింది.