ఫోటో స్టోరి: స్వర్గం నుంచి దిగొచ్చిన మేనక..!

Mon Jun 27 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Shraddha Das Latest Photo

స్వర్గంలో దేవాది దేవులను రంభ - ఊర్వశి- మేనక లు తమ రూపలావణ్యం నాట్య కళతో అలరించారని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుని సభలోని 31 మంది అప్సరసలలో ఊర్వశి ఒకరు. తాను ఆడితే పాడితే దానికి పరవశించని దేవుడు లేడు. అదంతా సరే కానీ ఇటీవలి కాలంలో అందాల శ్రద్ధాదాస్ ఊర్వశిని మించిపోతోందని గుసగుస స్ప్రెడ్ అవుతోంది. వరుసగా రకరకాల గెటప్పుల్లో ఫోటోషూట్లతో హీట్ పెంచేస్తోంది ఈ బెంగాళీ బ్యూటీ.తాజాగా కుంకుమ పువ్వు రంగు డిజైనర్ డ్రెస్ లో శ్రద్ధాదాస్ ఫోజులు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. షోల్డర్ లెస్ డ్రెస్ లో శ్రద్ధా ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇటీవల బ్లాక్ శారీలో రెడ్ హాట్ శారీలో కనిపించిన శ్రద్ధా నాభి అందాలను ఎలివేట్ చేసేందుకు పోటీపడింది. ఇక ఇప్పుడు ఎద అందాలను అంతే గమ్మత్తుగా ఎలివేట్ చేసి యూత్ కి మత్తెక్కిస్తోంది. అయితే శ్రద్ధా ఏం చేసినా కానీ అవకాశాల్ని ఒడిసిపట్టుకునేందుకే. ఇక సోషల్ మీడియాల్లోనూ ఈ భామ వాణిజ్య ప్రకటనల్ని షేర్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శ్రద్ధాదాస్ తెలుగులో దశాబ్ధం పైగానే కెరీర్ ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం `నిరీక్షణ` ..`అర్ధం` అనే సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఓటీటీలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. బుల్లితెర రియాలిటీ షోల్లో మెరుస్తూ హైదరాబాద్ నే ఇల్లు గా మార్చుకుని కథను నడిపించేస్తోంది.