పిక్ టాక్: అర్ధనగ్న అందాలను అమ్మడు ఎంత శ్రద్ధగా ఆరబోస్తోందో..!

Sun Nov 28 2021 09:00:59 GMT+0530 (IST)

Shraddha Das Latest Photo

సోషల్ మీడియా ద్వారా మన హీరోయిన్లు అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. సినిమాలు వ్యక్తిగత విషయాలతో పాటుగా సరికొత్త ఫొటో షూట్ లను పంచుకుంటారు. అదిరిపోయే ఫిగర్ తో ఉండే అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ కూడా నిత్యం గ్లామరస్ ఫోటోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంటుంది.. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు మతి పోగొడుతుంటుంది. తాజాగా శ్రద్ధాదాస్ మరో ఆకర్షణీయమైన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.సౌత్ ఇండియన్ బాంబ్ షెల్ గా పిలవబడే శ్రద్ధాదాస్.. లేటెస్ట్ క్లిక్స్ లో తన హాట్ నెస్ తో నెట్టింట వేడి పుట్టిస్తోంది. తన అందంతో యువ హృదయాలను మంత్రముగ్దులను చేస్తోంది. పర్పుల్ కలర్ బెనారస్ శారీ - వైట్ బ్లౌజ్ లో మరింత గ్లామరస్ గా సూపర్ హాట్ గా కనిపిస్తోంది. అమ్మడి నాజూకు నడుము - నాభి కనిపించేలా శ్రద్ధగా చీరకట్టిన విధానం అందరినీ కట్టిపడేస్తోంది. క్యూట్ స్మైల్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోందని చెప్పవచ్చు. బ్యూటీతో కాటేస్తున్న శ్రద్ధాదాస్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నారు.

కాగా 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్.. 'ఆర్య 2' లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత 'డార్లింగ్' 'నాగవల్లి' 'మొగుడు' 'గుంటూరు టాకీస్' 'గరుడవేగ' వంటి సినిమాల్లో మెరిసింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగుపెట్టి 'లాహోర్' 'దిల్ తో బచ్చా హై జీ' 'జిద్' 'లక్కీ కాబూతర్' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' వంటి చిత్రాల్లో నటించింది. అలానే పలు కన్నడ మలయాళ బెంగాలీ సినిమాల్లో అలరించింది.

ఇటీవల 'కోటిగొబ్బ 3' అనే కన్నడ సినిమాతో సక్సెస్ అందుకున్న శ్రద్ధాదాస్.. తెలుగులో చివరగా 'ఏక్ మినీ కథ' చిత్రంలో మినీ రోల్ లో నటించి మెప్పించింది. త్వరలో 'అర్ధం' 'నిరీక్షణ' వంటి సినిమాలు విడుదల కానున్నాయి. 'స్లీపర్ సెల్' అనే బెంగాలీ వెవ్ సిరీస్ ఆదివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాల్లో శ్రద్ధ కీలక పాత్రలు పోషిస్తోంది.

ఏదేమైనా అందంలో ఏ హీరోయిన్ కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదనే అనుకోవాలి. అందాల ఆరబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోయినా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. అన్ని భాషల్లో నటించినా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కాకపోతే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధగా తన ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజుల్లో తెలుగులో ఓ సాలిడ్ హిట్ అందుకొని సత్తా చాటుతుందేమో చూడాలి.