ఫోటో స్టోరీ: శ్రద్ధగా అద్దంలో అందాలు వడ్డించిందే!

Mon May 25 2020 12:45:54 GMT+0530 (IST)

Photo Story: Shradda Das Serving the Beauty in the Mirror!

దాదాపు డజనుకు పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఈ శ్రద్ధా దాస్ ఈమధ్య తెలుగులో ఫేడ్ అవుట్ అయిపోయింది.  ప్రస్తుతం కన్నడలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. సూపర్ ఫోటోలను పోస్ట్ చెయ్యడం ఈ భామకు హాబీ.  సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. షూటింగులు లేక ఖాళీగా ఉన్నా ఈ అప్డేట్లు ఆపదు.తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "#వింటేజ్ లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో శ్రద్ధ అందం ఎలా ఉందో వర్ణించడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. ఈ ఫోటోను కె. రాఘవేంద్రరావు గారు కనుక చూస్తే నావెలిజం అనే సినిమా తీసి ఉండేవారేమో.. ఇక అందులో బత్తాయిలు ఆరెంజులు. ద్రాక్ష లాంటి ఎన్నో రకాల ఫలాలతో అభిషేకం చేయించి ఉండేవారేమో.  ఇలాంటి ఫోటోలు చూడగానే దర్శకేంద్రులే ఎందుకు గుర్తొస్తారంటే.. ఆయన ఇలాంటి సీన్ల పేటెంట్ అనధికారికంగా ఆయన దగ్గరే ఉండిపోయింది.  

ఈ ఫోటోలో అసలు హైలైట్ ను మరింత హైలైట్ అయ్యేలా ఫోటోను తీసిన ఆ ఫోటోగ్రాఫర్ కు.. ఎంతో శ్రద్ధగా అందాన్ని ప్రతిఫలింపజేసిన ఆ అద్దానికి శతకోటి దండాలు పెట్టుకోవాల్సిందే. ప్రపంచంలో అందరూ సమానం అని కొందరు జఫ్ఫా-19 మెసేజులు చెప్తారు కానీ ఈ అందం ముందు ఏ అందం సమానం?  ఈ ఫోటోకు చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు కానీ ఒక క్రేజీ కామెంట్ ఏంటంటే.. "డేంజరస్ కర్వ్స్ ఎహెడ్".. అంతే అంతే!