ఫోటో స్టొరీ: బ్లాక్ లో స్టన్నింగ్ బ్యూటీ..

Wed Aug 21 2019 17:43:58 GMT+0530 (IST)

Showstopper Kat Looks Flawless

బాలీవుడ్ అనగానే ఖాన్లు.. కపూర్లే కాకుండా చాలామంది హాట్ బ్యూటీలు మనసులో మెదుల్తారు.  హీరోలైతే ఫిఫ్టీలలో కూడా ఫైట్లు చేస్తూ.. రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు.  అదే హాటు బ్యూటీల విషయం వచ్చేసరికి  బాలీవుడ్ లో వారి కెరీర్ ఐదేళ్ళకు మించి సాగదు.  అలాంటిది కత్రినా కైఫ్ మాత్రం గత పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగడమే కాదు.. ఇప్పటికీ టాప్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ సూపర్ హిట్స్ సాధిస్తోంది.  రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన 'భారత్' సూపర్ హిట్ కావడంతో తన లిస్టులో మరో హిట్టు వచ్చి చేరింది.  సోషల్ మీడియా విషయానికి వస్తే కత్రినా ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. రెగ్యులర్ అప్డేట్స్ తో అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "అబావుట్ లాస్ట్ నాయిట్" అంటూ హిందీలో క్యాప్షన్ ఇచ్చింది.  ఇదేం భాషరా బాబు.. అని షాక్ తినే లోపు అర్థం అయింది. 'అబౌట్ లాస్ట్ నైట్' ను ఒంగో పెట్టి రెండు గుద్దులు గుద్ది బలవంతంగా సాగదీస్తే అలా జరిగిందని. మన అచ్చ తెలుగులోకి చక్కగా అనువాదం చేసుకుంటే "నిన్న రాత్రి".  ఇక తన డ్రెస్ ను డిజైన్ చేసిన వారు  మనీష్ మల్హోత్రా" అని కూడా క్యాప్షన్లోనే వెల్లడించింది.  నిజం చెప్పొద్దూ.. ఈ ఫోటోలో కత్రినా బ్యూటీ క్వీన్ లాగా ఉంది. డీప్ వీ నెక్ ఉండే బ్లాక్ ఛోళీ..  పూల డిజైన్ ఉండే నలుపు లెహెంగా ధరించి రాణిలా నిలబడింది.  మెడలో నెక్లెస్.. ఇయర్ రింగ్స్.. చేతికి ఉండే బ్రేస్ లేట్ అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టుగా ఉన్నాయి.  పర్ఫెక్ట్ మేకప్ తో ఒక సూపర్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ ఫోటోల దెబ్బకు నెటిజన్ల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.   పోస్ట్ చేసిన ఐదుగంటల్లోనే 8 లక్షల లైకులు వచ్చాయి.  దియా మిర్జా.. సోఫీ చౌదరి.. హ్యూమా ఖురేషీ.. ఎల్లి అవ్రామ్.. అమైరా దస్తూర్.. భూమి పెడ్నేకర్ లాంటి చాలామంది బ్యూటీలు ఈ ఫోటోలకు ఓ లైక్ వేసుకున్నారు.  కామెంట్లు కూడా చాలానే వచ్చాయి.  "బ్యూటిఫుల్ క్వీన్".. "స్టన్నింగ్ బ్యూటీ".. "బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక కత్రినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది.