Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు తెరిస్తే డ‌బ్బింగులే ముందు వేయాలా?

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:45 AM GMT
థియేట‌ర్లు తెరిస్తే డ‌బ్బింగులే ముందు వేయాలా?
X
నాలుగైదు నెల‌లుగా థియేట‌ర్లు తెర‌వ‌క దాదాపు 20-30 సినిమాలు ల్యాబుల్లో స్టాక్ ఉండిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ క్యూలో ఉన్నాయి. రిలీజ్ కావాలంటే థియేట‌ర్లు తెర‌వాలి. అటుపై ఛాంబ‌ర్ నుంచి లైన్ క్లియ‌ర్ కావాల్సి ఉంటుంది. ఇటీవ‌ల పెద్ద‌రికం నెరుపుతున్న నిర్మాత‌ల గిల్డ్ వాళ్లు ఏం ప్లాన్ చేస్తున్నారు? అన్న‌ది కీల‌కం. అదంతా స‌రే కానీ.. ఈ క్రైసిస్ లో పెండింగులో ప‌డిపోయిన వాటిలో ముందుగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్ని వ‌ద‌లాలా? లేక డ‌బ్బింగులనే రిలీజ్ చేయాలా?

దీనికి స‌మాధానం కావాలంటే ముందుగా ఈ విష‌యాలు తెలియాలి. ఏమాత్రం థియేట‌ర్లు తెరిచేందుకు అవ‌కాశం చిక్కినా ముందుగా తెలుగు సినిమాలు ఆ తరువాతే మిగతా వాటికి అవకాశం అని ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకునే విధంగా అన్ని వర్గాల నిర్మాతలు ట్రై చేస్తున్నారట‌. ఐతే దీనికి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి పెట్టుకున్న కొందరు నిర్మాతలు నుంచి వ్యతిరేకత ఎదుర‌వుతోంది.

డ‌బ్బింగ్ నిర్మాత‌ల వాదన ఏంటి అంటే..! ఒక బాగాలేని తెలుగు స్ట్రెయిట్ సినిమాకి ఈ క్రైసిస్ టైం లో థియేటర్ అలాట్ చేసి.. థియేటర్ కి కాస్తో కూస్తో వచ్చే జనాలని బెదరగొట్టే బదులు.. బాగున్న డబ్బింగ్ సినిమా వేసుకుంటే బెటర్ ఏమో అంటున్నారట‌. దీనికి ఆన్సర్ ప్రస్తుతం ఎవరి దగ్గర లేదు. నాని- సుధీర్ బాబు న‌టించిన వీ... ర‌వితేజ క్రాక్ .. అనుష్క నిశ్శ‌బ్ధం .. వైష్ణ‌వ్ తేజ్ - ఉప్పెన ఇవ‌న్నీ రిలీజ్ క్యూలో ఉన్నాయి. వీటితో పాటు చోటా మోటా స్ట్రెయిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. వీట‌న్నిటినీ కాద‌ని డ‌బ్బింగుల్నే ముందు వేస్తారా? కాస్త ఆగితే కానీ చాంబ‌ర్ వ‌ర్గాలు లేదా గిల్డ్ పెత్తందారీలు ఏం నిర్ణ‌యించారో తెలీదు.