నాన్నా నానీ.. ఈ పీఆర్ టీమ్ ని పెట్టుకుంటే అంతే నీ సీన్ ఇక!

Mon Feb 24 2020 14:30:24 GMT+0530 (IST)

Should Nani Considering A New Pr Team?

ఇది సోషల్ మీడియా యుగం అనే మాట నిజమే. అయితే ట్వీట్లు షేర్లతోనే ఎవరి కడుపూ నిండిపోదు! సినిమా రంగానికి కూడా ఈ విషయం వర్తిస్తుంది. చాలా సినిమాలు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంతరించుకుంటూ ఉంటాయి అయితే బాక్సాఫీస్ వద్ద ఆ క్రేజ్ కనిపించదు. సోషల్ మీడియాలో ఎన్ని షేర్లు వచ్చినా.. సినిమాకు కావాల్సింది గ్రాస్ షేర్ కలెక్షన్లు మాత్రమే! ఈ విషయాన్ని మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తున్నాయి సినీ ఇండస్ట్రీలోని కొన్ని పీఆర్ టీమ్స్. నటుడు నాని పీఆర్ టీమ్ ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉందని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంది. ఆ టీమ్ ఎంత సేపూ తాము ప్రమోట్ చేసే సినిమాలకు సంబంధించి ట్వీట్లు చేయడం.. దాన్ని అంత మంది రీట్వీట్ చేశారు యూట్యూబ్ లో అన్ని వ్యూస్ వచ్చాయి.. అంటూ చెప్పుకునేసి మిలియన్ వ్యూస్ రికార్డు అంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉన్నారు.సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం చాలా సులువు. ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి యాడ్ ఇస్తే.. చెత్త విషయాలకు కూడా బోలెడన్ని షేర్లు వస్తాయి! వాటితో ప్రయోజనం ఎంత? అనే విషయాన్ని మాత్రం సినిమా వాళ్లు గుర్తించలేరేమో! అందుకే ఇప్పుడు నాని వంటి యంగ్ హీరో కూడా ఒక పీఆర్ టీమ్ ను అమాయకంగా నమ్మేస్తూ ఉన్నాడని భోగట్టా!

ఇది వరకూ ఆ పీఆర్ టీమ్ కు అలాంటి ఘనమైన రికార్డు ఉంది. ఇటీవలే *జాను* వంటి ఫీల్ గుడ్ మూవీకి పరమ వీక్ పబ్లిసిటీ ఇచ్చింది కూడా సదరు టీమ్ ఘనతే! తమిళం లో అంత మంచి హిట్ అయి ఉండి తెలుగులో అంతటా ఫుల్ పాజిటివ్ రివ్యూలు పొంది సమంత వంటి స్టార్ ఉన్నా ఆ సినిమాకు కనీస కలెక్షన్లు కూడా రాలేదు! అంత సానుకూల పరిస్థితిల్లో కూడా ఆ సినిమాను ప్రమోట్ చేయలేకపోయారంటే.. ఎవరికైనా నిజమే కదా! అనిపిస్తుంది ఆ టీమ్ గురించి జరుగుతున్న ప్రచారం!

ఇక మీడియా పర్సన్స్ తో దురుసుగా ఉండటం ఈ టీమ్ మరో ఘనత. ఏదో సినిమా లో మంచి మ్యాటర్ ఉండి వెళ్లాల్సిందే తప్ప.. ఈ టీమ్ ను నమ్ముకుంటే అంతే సంగతులు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

విషయం ఏమిటంటే.. సూపర్ హిట్స్ తో దూసుకపోతున్న నానికి అలాగే మీడియా సర్కిల్స్ లో మంచి పేరున్న నానికి చెడ్డపేరు తీసుకొచ్చిందీ ఈ టీమే అని ఎరిగిన వారు అంటున్నారు. ఫేక్ పబ్లిసిటీ స్టంట్స్ ని జత చేయడం కూడా ఈ టీమ్ ముఖ్యుడి ప్రణాళికేనట. ఈ పీఆర్ టీమ్ జత అయ్యాకా నానికి వరస ఫ్లాప్స్ కూడా రావడం గమనార్హం. కృష్ణార్జున యుద్ధం ఆ!.. ఇలా చెప్పుకుపోతే ఈ టీమ్ లీలలు చాలానే ఉన్నాయి!

డిజిటల్ మీడియాను వదిలి హీరోని కింది సెంటర్స్ కి ఎలా తీసుకెళ్లాలి అనే థింక్ చేసి ఆ ప్రకారం వర్క్ చేస్తే నాని మాస్ మెచ్చిన స్టార్ హీరో అవుతాడు. లేకపోతే మళ్లీ భలేభలే మగాడివోయ్ ముందు నాని ఎలా ఇబ్బంది పడ్డాడో అలానే పడాల్సి వస్తుందని ఆ హీరో శ్రేయోభిలాషులు అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మిగతా హీరోలు కూడా సలహాలు ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. హిట్ అనిపించుకున్న సినిమాలకు కూడా బజ్ లేకుండా చేసే విడుదల అవుతున్న విషయం కూడా ఎవరికీ తెలియని స్థాయి ప్రచారం చేసే పీఆర్ టీమ్ ను నమ్ముకుంటే అంతే సంగతులు అంటున్నారు!