అక్కినేని హీరోకి సాలిడ్ హిట్ పడాల్సిందేనా... ?

Fri Oct 22 2021 21:00:01 GMT+0530 (IST)

Should Akkineni hero get a solid hit

అక్కినేని మూడవ తరం ఇపుడు టాలీవుడ్ ని ఏలుతోంది. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 1944లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2014 లో చివరిగా వచ్చిన మనం మూవీ దాకా నటిస్తూనే ఉన్నారు. ఆయన నట జీవితం డెబ్బై ఏళ్ళు ఇక పాతికేళ్ల వయసులో హీరో అయిన నాగార్జున ఆరు పదులలో కూడా జోరు పెంచుతూనే ఉన్నారు. నాగ చైతన్యకు మంచి హీరోగా పేరు వచ్చింది. చేతిలో కొన్ని హిట్లున్నాయి. అఖిల్ విషయానికి వస్తే మొత్తానికి ఫస్ట్ హిట్ దక్కింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ మూవీతో బాధ తీరింది. అయితే ఈ క్రెడిట్ మొత్తం అక్కినేని హీరో సొంతమా అంటే అక్కడే జవాబు తేడాగా వస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఆమె స్టార్ హీరోయిన్. దాంతో పాటు లక్కీయెస్ట్ హీరోయిన్ అని పేరు.దాంతో పూజా ఉండబట్టే హిట్ అన్న ప్రచారం సాగుతోంది. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ కి కూడా మరో వైపు క్రెడిట్ కొంత వెళ్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ విషయంలో పడ్డ కష్టంతో ఆయనకు కూడా కొంత గుర్తింపు దక్కింది. అఖిల్ డ్యాన్సులు బాగున్నాయి. నటనలో మెచ్యూరిటీ ఉంది ఇలా మార్కులు బాగానే పడ్డా కూడా మొత్తానికి మొత్తం క్రైడిట్ మాత్రం ఇచ్చే సీన్ లేదు అంటున్నారు. దాంతో అఖిల్ చూపు ఏజెంట్ మూవీ మీద ఉందిట. ఈ మూవీ పక్కా మాస్ అప్పీల్ తో చేస్తున్నారు. అఖిల్ కూడా ఇలాంటి రగ్డ్ టైప్ క్యారక్టర్ కోరి మరీ చేస్తున్నాడు. ఇక పక్కా మాస్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతిలో పడ్డాడు.

దాంతో పాటు టోటల్ మేకోవర్ చేంజి చేసిన సురేందర్ రెడ్డి అఖిల్ ని ఈ దెబ్బతో స్టార్ హీరోగా నిలబెట్టేస్తాడు అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మూడు తరాలుగా క్లాస్ ఇమేజ్ గట్టిగానే ఉంది. అప్పట్లో ఏయన్నార్ అయినా తరువాత నాగార్జున అయినా మాస్ మూవీస్ చేశారు. కానీ ఎందుకో మాస్ కంటే క్లాస్ ఇమేజే వారికి ఇచ్చేశారు. దాంతో మూడవ తరంలో ఆ లోటుని తీర్చేది కచ్చితంగా అఖిల్ అనే అంటున్నారు. అఖిల్ కూడా ఏజెంట్ గా సరికొత్త గెటప్ లో ఫ్యాన్స్ ని తెగ హుషార్ తెచ్చిపెడుతున్నారు.

ఈ మూవీ షూటింగ్ ని వేగంగా పూర్తి చేసి 2022 సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దాంతో వచ్చే ఏడాది అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఏజెంట్ రాబోతోంది అని అపుడే లెక్కలు వేస్తున్నారు. అంతే కాదు అఖిల్ లోని తీరని దాహాన్ని పూర్తిగా తీర్చేడయమే కాదు అక్కినేని ఫ్యామిలీకి కూడా సరికొత్త మాస్ ఇమేజ్ ని తెచ్చేదిగా ఏజెంట్ ని భావిస్తున్నారు. సాలిడ్ హిట్ తో సత్తా చాటడానికి అక్కినేని హీరో అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో రెడీ అయిపోయాడు మరి.