77 అవార్డులు అందుకున్న షార్ట్ ఫిల్మ్..!

Tue Dec 06 2022 21:00:02 GMT+0530 (India Standard Time)

Short Film That Won 77 Awards

మీడియా మాధ్యమం ప్రభావం ఎక్కువవుతున్న ఈ టైం లో సినిమా అది ఎలాంటిది అయినా సరే మీడియా మాధ్యమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వారికి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక షార్ట్ ఫిల్మ్ కి ఒకటి రెండు కాదు ఏకంగా 77 అవార్డులు రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ లఘు చిత్రాన్ని ప్రశంసిస్తూ నటుడు దర్శకుడు కె. భాగ్యరాజ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి షార్ట్ ఫిల్మ్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిదని.. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ 77 అవార్డులు అందుకోవడం గొప్ప విషయమని అన్నారు భాగ్యరాజ్. కథి అండ్ రఫీ ఫిలింస్ బ్యానర్ లో నిర్మించిన షష్ఠి షార్ట్ ఫిల్మ్ వివిధ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది.

అంతేకాదు ఏకంగా 77 అవార్డులను కూడా అందుకుంది. ఇన్ని అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబందించిన ఈ ఈవెంట్ ని ఇంత సైలెంట్ గా జరపడం కూడా ఆశ్చర్యంగా ఉందని అన్నారు భాగ్య రాజ్.

గొప్ప గొప్ప వాళ్లంతా కూడా సినిమాలపైన ఉన్న ఆసక్తితో పరిశ్రమలోకి అడుగు పెట్టారని.. జాన్ పీటర్ డామియన్ లోకేష్ కనగరాజ్ ఇలా చాలామంది సినిమాల మీద మక్కువతో ఈ రంగంలోకి వస్తారని అన్నారు.  

సినిమాలు తీయడమే కాదు దానికి సంబంధించిన కోర్స్ కూడా చేసి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేస్తున్నారని అందుకే అతని సినిమాలు అంత విజయాన్ని అందుకుంటున్నాయని అన్నారు భాగ్యరాజ్. సినిమాలపైన ఆసక్తి ఉన్న యువకులు మనసు పెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం వరిస్తుందని అన్నారు.      

ఇక ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ జూట్ పీటర్ కూడా తను చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ కు ఒకటి రెండు అవార్డులు వస్తాయని అనుకోగా.. ఇన్ని అవార్డులు రావడం తనకే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. చెమ్మలర్ అన్నం లిజి ఆంటోని డాక్టర్ ఎస్.కె గాయత్ర్ హారీస్ మాస్టర్ జెఫ్రీ హేంస్ ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.