షూర్వీర్ ట్రైలర్.. త్రివిధ దళాలతో దండయాత్ర

Tue Jun 28 2022 17:00:01 GMT+0530 (IST)

Shoorveer Trailer Action Series

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మార్కెట్ పెరిగిన తర్వాత విభిన్నమైన కంటెంట్ తో కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. డిస్ని ప్లస్ హాట్ స్టార్ కూడా ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ తో కూడా పోటీపడుతూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది. హాట్ స్టార్ స్పెషల్ కేటగిరీల కొన్ని విభిన్నమైన ప్రాజెక్టులను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇక త్వరలోనే ఈ సంస్థ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటివరకు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అందులో త్రివిధ సాయుధ దళాల నేపద్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మొదటిసారి 'షుర్ వీర్' వెబ్ సీరీస్ ద్వారా ఆ సరికొత్త ప్రయోగాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 15 నుండి స్ట్రీమింగ్ కాబోయే ఈ వెబ్ సిరీస్ పై ఓ వర్గం ప్రేక్షకులలో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఎందుకంటే ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. ట్రైలర్ ను చూస్తే.. త్రివిధ సాయుధ దళాలు ఆర్మీ వైమానిక దళం నావికాదళం ఒక భయంకరమైన సమస్య నుంచి దేశాన్ని ఎలా కాపాడుకుంది అనేది అసలు కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. దేశానికి ఎంతో ప్రాధాన్యమైన త్రివిధ రక్షణ దళాలకు సంబంధించిన బాలలను ఇందులో హైలెట్ చేయబోతున్నారు.

ఈ షోను జగ్గర్నాట్ ప్రొడక్షన్స్ లో సమర్ ఖాన్ నిర్మించగా.. కనిష్క్ వర్మ ఈ మిలిటరీ డ్రామాకి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరీస్ లో మకరంద్ దేశ్‌పాండే రెజీనా కసాండ్రా ఆదిల్ ఖాన్ అర్మాన్ రల్హాన్ అలాగే మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో రెజీనా కీలక పాత్రలో కనిపిస్తూ ఉండడం విశేషం. ఇదివరకే కొన్ని వెబ్ సీరీస్ లలో నటించిన రేజీనాకి అనుకున్నంతగా గుర్తింపు అయితే లభించలేదు. దీంతో ఈ వెబ్ సీరీస్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తోంది.