షాకింగ్ ట్విస్ట్: క్రికెటర్ ప్రేమలో స్టార్ హీరో వైఫ్..!

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

Shocking twist: Star hero wife in cricketer love ..!

స్టార్ హీరోయిన్లకు ధీటుగా సదరు అందాల స్టార్ వైఫ్ ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది. ఇటీవల కమర్షియల్ ప్రకటనల్లోనూ అవకాశం దక్కించుకుని ఆర్జిస్తోంది.. అదంతా వదిలేస్తే.. ఇక ఈ అమ్మడు తన హబ్బీ షాహిద్ ని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం కామెంట్లు చేసేస్తామంటే ఒప్పదు మీరాకు. ఆ సంగతి చాలాసార్లు బయటపడింది.ఇటీవల మీరా సోషల్ మీడియాలో క్యూ అండ్ ఎ సెషన్ నిర్వహించగా..షాహిద్ లో అత్యంత ఇబ్బంది పెట్టే అలవాటు ఏది? అంటూ ఒక అభిమాని మీరాను అడిగాడు. తన భర్త టెక్స్టింగ్ చేసేటప్పుడు అక్షర దోషాలతో మెసేజ్ లు పెట్టడం తనని బాధిస్తుందని మీరా తెలిపారు. ఆయన నిజంగా ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తానని తెలిపింది. ఇక తన భర్తను ఎవరేమన్నా ఊరుకోనని మీరా అన్నారు.

మీరా రాజ్‌పుత్ `నన్ను అడగండి` సెషన్ ద్వారా ఇంకా చాలా విషయాలే చెప్పింది. తన క్రష్ ఎవరిపైనో కూడా తెలిపింది. మీరా రాజ్ పుత్ కు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ పై క్రష్ ఉందట. అంతేకాదు.. తన సమాధానంతో పాటు డివిలియర్స్ ఉన్న GIF ని జోడించింది. ``నేను అతన్ని ప్రేమిస్తున్నాను`` అని చెప్పింది. మీరా రాజ్‌పుత్ ఎంతో నిజాయితీతో కూడిన సమాధానానికి ఆమె భర్త షాహిద్ కపూర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రముఖ తారలు పంకజ్ కపూర్ - నీలిమా అజీమ్ ల కుమారుడు షాహిద్ కపూర్. బాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఏల్తున్నారు. 2015 జూలైలో మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్నారు. వారి కుమార్తె మిషా పెళ్లయిన ఏడాదికే  జన్మించింది. షాహిద్ - మీరాకు జైన్ అనే కుమారుడు ఉన్నాడు. 2018 సంవత్సరంలో రెండో బిడ్డకు స్వాగతం పలికారు. కబీర్ సింగ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న షాహిద్ ప్రస్తుతం జెర్సీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఇందులో అతను క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు.