మోహన్ బాబు కేసులో షాకింగ్ అంశాలు

Sun Aug 02 2020 12:40:44 GMT+0530 (IST)

Shocking facts in Mohan Babu case

గత రాత్రి హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లోకి కొంతమంది దుండగులు చొరబడి ‘నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించడం కలకలం రేపింది. దీంతో భయాందోళనకు గురైన మోహన్ బాబు.. కుటుంబ సభ్యులు ఆగంతుకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.మోహన్ బాబు ఇంటి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపి ఆ దుండగులను అరెస్ట్ చేశారు.

ఈ నలుగురు నిందితులు మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ కు చెందిన వాళ్లని పోలీసులు గుర్తించారు. వీళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు వీళ్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వీళ్లు కావాలని చేశారా? లేక ఎవరైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.