Begin typing your search above and press return to search.

షాకింగ్‌: అక్కినేని కోడ‌లు బుల్లితెర ఎంట్రీ?

By:  Tupaki Desk   |   22 Jan 2020 6:43 AM GMT
షాకింగ్‌: అక్కినేని కోడ‌లు బుల్లితెర ఎంట్రీ?
X
అక్కినేని కోడ‌లు స‌మంత‌ టాలీవుడ్ లో న్యూ గేమ్ ఛేంజ‌ర్ కాబోతోందా? సాటి నాయిక‌ల కంటే డిఫ‌రెంట్ స్ట్రాట‌జీని అనుస‌రిస్తోందా? అంటే.. అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. శ‌ర్వా స‌ర‌స‌న న‌టిస్తున్న‌ `జాను` త‌ర్వాత స‌మంత కొత్త స్కీమ్ ఏమిటి? అస‌లు సినిమాల్లో న‌టిస్తుందా లేదా? వెబ్ సిరీస్ లు.. టీవీ షోలు అంటూ కొత్త దారి వెతుకుతోందా? అంటే వీట‌న్నిటికి సామ్ ప్రాక్టిక‌ల్ గానే ఆన్స‌ర్ ఇస్తోంది. చైతూకి ఒక వార‌సుడిని అందించి గృహిణిగా సెటిలైతే ఆదాయ మార్గాలేమిటి? అన్న‌దానిపైనా అన్వేషిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

స‌మంత ఇప్ప‌టికే సొంత బ్యాన‌ర్ ని స్థాపించి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణానికి సిద్ధ‌మ‌వుతోంద‌న్న ప్ర‌చారం ఉంది. బాలీవుడ్ స్టార్లు అనుష్క శ‌ర్మ‌.. కాజోల్ త‌ర‌హాలో తాను కూడా నిర్మాత కానుంది. ప్ర‌స్తుతం జాను రిలీజ్ అయితే చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. భ‌ర్త నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ సినిమాకి క‌మిటైంది సామ్. అలాగే ఫ్యామిలీ మ్యాన్ (సీజ‌న్ 2) వెబ్ సిరీస్ లోనూ న‌టించింది. ఈలోగానే బుల్లితెర షోల‌తో బిజీ కానుంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

ఇంటింటికి సామ్ త‌ర‌హాలో ఓ బుల్లితెర టాక్ షోని త‌న‌కోసం డిజైన్ చేశార‌ని అందుకు సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక‌ ప్ర‌క‌ట‌న వెలువ‌డనుంద‌ని తెలుస్తోంది. ఇది ఏ చానెల్ లో ఉంటుంది? ఎన్ని ఎపిసోడ్లు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక ఈ టాక్ షో ద్వారా సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూలు చేస్తుందా? లేక ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా ఉంటుందా? అన్న‌ది చూడాలి. అక్కినేని కోడ‌లుగా త‌న‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏదైనా సామాజిక అంశంతో ముడిప‌డిన కార్య‌క్ర‌మం చేస్తుంద‌నే భావిస్తున్నారు. ప్ర‌త్యూష సామాజిక సంస్థ ద్వారా సేవ‌లందిస్తున్న స‌మంత ఏదైనా కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తుందేమో చూడాల‌న్న ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.