ఇండోనేషియా దీవుల్లో.. తెలుగు సోయగం!

Mon Jan 25 2021 12:00:01 GMT+0530 (IST)

Shobitha Dulapala Latest Stunning Pose

‘శోభిత ధూళిపాల..’ ఈ అచ్చ తెలుగు అందం ఈ మధ్యనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మొదట్లో బాలీవుడ్ లో తన లక్ ను టెస్ట్ చేసుకున్న ఈ భామ.. పలు సినిమాల్లో నటించంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది శోభిత. ఆ తర్వాత 'చెఫ్స అనంతరం  'కాలాకాండిస వంటి హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ కు వచ్చింది.తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'గూఢచారి' లో నటించింది. ఆ సినిమాతో ఇక్కడి వారికి పరిచయమైంది. అయితే.. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు శోభితకు. కరోనా లాక్ డౌన్ కూడా ఈ అమ్మడి ఆశలకు అడ్డంకిగా నిలిచింది. అయినప్పటికీ తన జర్నీకి బ్రేక్ ఇవ్వకుండా.. పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది శోభిత.

సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రానప్పటికీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు. దాదాపు 525కే ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహమాట పడకుండా.. టాప్ టూ బాటమ్ స్కిన్ షో చేస్తుంటుందీ అమ్మడు. బోల్డ్ పిక్స్ తో బోలెడు అందాలు ఆరబోస్తున్న ఈ తెలుగు శోభితాన్ని కళ్లప్పగించి చూస్తుంటారు ఫ్యాన్స్.

అయితే.. తాజాగా ‘మేడ్ ఇన్ తెనాలి’ బ్యూటీ ఇండోనేషియాలో సేద తీరుతోంది. రియావు దీవుల ప్రావిన్స్‌లో అతిపెద్ద నగరమైన బాటంలో సందడి చేస్తోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. బేర్ ఫూట్ తో చేతిలో హ్యాట్ తో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్ వైరల్ అవుతోంది.