ఎట్టకేలకు స్పందించింది.. చైతూ విషయంలో క్లారిటీ!

Tue Jun 28 2022 14:02:29 GMT+0530 (IST)

Shobitha Clarity on Love with Chaitanya

నాగ చైతన్య మరియు శోభిత దూళ్లిపాళ్ల ప్రేమలో ఉన్నారు. ఇద్దరు కామన్ ఫ్రెండ్ పార్టీ లో కలిసి ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు కూడా హైదరాబాద్.. ముంబయిలో నైట్ పార్టీలకు హాజరు అవుతూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ గత కొన్ని రోజులు గా మీడియాలో ప్రముఖంగా వస్తున్న కథనాల సారాంశం.తెలుగమ్మాయి అయినా కూడా హీరోయిన్ గా ఇక్కడ ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కించుకున్న శోభిత తో చైతూ ప్రేమ అనగానే చాలా మంది అవాక్కవుతున్నారు. సమంత వంటి అందగత్తెకు విడాకులు ఇచ్చి శోభితతో ప్రేమలో చైతూ పడటం ఏంటీ విడ్డూరం కాకుంటే అంటూ సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

వీరి ప్రేమ విషయమై వార్తలు రాబట్టి వారాలు గడుస్తున్నాయి. అయినా కూడా ఇద్దరి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిజమేనేమో కావచ్చు అంటూ మరింత బలంగా నమ్ముతున్న వారు ఉన్నారు.

ఎట్టకేలకు శోభిత నుండి క్లారిటీ వచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ ఆమె క్లారిటీ ఇవ్వడం తో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ చైతూ తో తనకు ప్రేమ వ్యవహారం అంటూ మీడియా లో వస్తున్న వార్తల్లో నిజం లేదు.. అసలు చైతూ తో అంతటి క్లోజ్ పరిచయం కూడా లేదు అన్నట్లుగా సన్నిహితుల వద్ద శోభిత చెప్పింది. నిప్పు లేనిదే పొగ రాదు అనేది సామెత. నిజమే కదా.. కనీసం చిన్న అనుమానం కూడా లేకుండా వారిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎలా మీడియాలో ఇంతగా వార్తలు వచ్చాయి.

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉండగా శోభిత పేరు చెప్పి చైతూ ఆమె ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.. ఎంతో మంది హీరోలు ఉండగా శోభిత ఆయన ప్రేమలో ఉన్నట్లుగా ఎందుకు వార్తలు వచ్చాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. శోభిత నిజం చెబుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శోభిత క్లారిటీ ఇచ్చినా కొందరు మాత్రం అనుమానంలోనే ఉన్నారు.