Begin typing your search above and press return to search.

RX100 పాయ‌ల్ ని కొట్టేలా ఉందీ పంజాబీ బ్యూటీ

By:  Tupaki Desk   |   15 May 2021 11:53 AM GMT
RX100 పాయ‌ల్ ని కొట్టేలా ఉందీ పంజాబీ బ్యూటీ
X
తెలుగు ఫిలింస‌ర్కిల్స్ కి అంత‌గా ప‌రిచ‌యం లేని పేరు శోభిత రానా. ఈ బ్యూటీ క‌న్న‌డ‌లో వ‌రుస సినిమాలు చేస్తోంది. అక్క‌డ షాడో- ఇన్ క‌మింగ్ కాల్ అనే చిత్రాల్లో న‌టించింది. చండీగ‌ర్ నుంచి వ‌చ్చి సౌత్ లో స‌త్తా చాటుతోంది ఈ బ్యూటీ.

క‌న్న‌డ న‌టి శోభిత రానా ఇటీవ‌లే తాజ్ కృష్ణలో ఓ ఫ్యాష‌న్ ఈవెంట్లో పాల్గొన్న‌ప్పుడు .. తెలుగులో ఏ హీరోతో అయితే న‌టిస్తారు? అన్న ప్ర‌శ్న‌కు.. వెంట‌నే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే త‌న‌కు చాలా ఇష్టం అని తెలిపింది.

అయితే అంత పెద్ద స్టార్ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం క‌ష్ట‌మే కానీ.. తెలుగులో మిడ్ రేంజ్ హీరోల‌కు ఈ భామ బెట‌ర్ ఆప్ష‌న్ అనేది అంద‌రి అభిప్రాయం. అందాల శోభిత సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా అభిమానుల్ని పెంచుకుంటోంది. తాజాగా పింక్ ఫ్లోర‌ల్ ప్రింటెడ్ డ్రెస్ లో శోభిత ఇచ్చిన కిల్ల‌ర్ ఫోజులు యువ‌త‌రంలో సెన్సేష‌న‌ల్ గా మారాయి. పంజాబీలో ఇష్క్ బ్రాందీ అనే హిట్ చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బాలీవుడ్ లోనూ `గోలు అండ్ ప‌ప్పు` అనే చిత్రంతో రంగ ప్ర‌వేశం చేసింది. ప్ర‌స్తుతం తెలుగులోనూ ఈ బ్యూటీ స్క్రిప్టులు వింటోంద‌ని స‌మాచారం. పంజాబీ నాయిక పాయ‌ల్ రాజ్ పుత్ త‌ర‌హాలోనే తెలుగులోనూ పాపుల‌ర‌వుతుందేమో చూడాలి.