Begin typing your search above and press return to search.

పెళ్లి లేదు.. కానీ ఆ హీరోయిన్ ఓ పాపకు తల్లి!

By:  Tupaki Desk   |   26 May 2020 3:45 AM GMT
పెళ్లి లేదు.. కానీ ఆ హీరోయిన్ ఓ పాపకు తల్లి!
X
శోభన.. ఈ పేరు మన తెలుగు సినీ ప్రియులకు కొత్తేమి కాదు. 1980, 90'లలో తెలుగులోని స్టార్ హీరోల అందరి సరసన నటించింది ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శోభన. తన నటన, నాట్యంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి దగ్గరైంది. నటి శోభన గురించి తెలుగువారికి పరిచయం చేయవలసిన పని లేదు. అప్పట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, నటకిరీటి రాజేంద్రప్రసాద్, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో భారీ హిట్లు అందుకుంది. అయితే సినిమాల పరంగా ఎంత స్టార్డమ్ సాధించిందో.. నాట్యం పరంగా జీవితాన్ని ఎంతో ఆస్వాదించింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం శోభన ఎందుకో సక్సెస్ కాలేదని చెప్పాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అని అందరికి పెద్ద డౌట్.

అయితే ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా శోభన ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె హీరోయిన్ గా కొనసాగినప్పుడు పెళ్లి జరగబోతుందని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఇక శోభన ప్రేమ విషయంలో ఓడిపోయిందట. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోని శోభన గాఢంగా ప్రేమించిందట. కానీ ఆ హీరో శోభనను కాదని వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడట. అప్పటినుండి ప్రేమ, పెళ్లి అనే బంధాలకి శోభన దూరంగా ఉంటుందట. అయితే ప్రస్తుతం తన ఒంటరితనాన్ని మర్చిపోయేందుకు ఒక చిన్న పాపను దత్తత తీసుకొని ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది. దేశవ్యాప్తంగా నేటి యువతరం నటీనటులకు నటన మరియు నాట్యంలో శిక్షణ ఇస్తోందట. ప్రస్తుతం శోభన చెన్నైలోనే తన కూతురుతో నివాసం ఉంటుంది. ఇక పెళ్లి వద్దు.. పాపే ముద్దు అంటూ జీవిస్తుంది. ఇక మూవీస్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన "వారనే ఆవశ్యముందే" అనే సినిమాలో మెరిసింది.