అప్పు నా పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది

Mon Nov 29 2021 13:55:56 GMT+0530 (IST)

Shivraj Kumar recently gave an interview

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చనిపోయి నెల రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా అభిమానులు ఆయన మరణ వార్త జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ పేరు ప్రస్థావన వచ్చినా.. ఆయన సినిమాలు టీవీలో వచ్చినా కూడా అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.పునీత్ ను ఇంత చిన్న వయసులో కోల్పోవాల్సి వచ్చినందుకు ప్రతి ఒక్కరు బాధ పడుతున్నారు. వారి కుటుంబ సభ్యుల మాదిరిగా కన్నడ సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడుస్తున్నా ఆ బాధ ఏమాత్రం తగ్గడం లేదు. అభిమానులే అలా ఉంటే ఇక కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్బంగా శివ రాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. సాదారణంగానే ఆయన చాలా ఎమోషనల్ అంటూ ఉంటారు. అలాంటిది తమ్ముడి మరణ వార్తను ఆయన తట్టుకోలేక పోయాడు. తమ్ముడితో ఉన్న అనుబంధంను గుర్తు చేసుకుంటూ ఎడుస్తూనే ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో మరోసారి శివ రాజ్ కుమార్ కన్నీరు పెట్టుకున్నాడు.

తమ్ముడు తన పక్కనే నిలబడి ఉన్నట్లుగా... తనతో ఏదో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. నా తమ్ముడు ఈ లోకంను వదిలి వెళ్లాడు అంటే నమ్మాలనిపించడం లేదని ఎమోషనల్ అయ్యాడు. శివ రాజ్ కుమార్ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పునీత్ రాజ్ కుమార్ మరియు శివ రాజ్ కుమార్ లు ఇద్దరికి కూడా కన్నడంతో పాటు సౌత్ భాషల అన్నింటిలో కూడా గుర్తింపు ఉంది. శివ రాజ్ కుమార్ తెలుగు లో ఒక సినిమాను చేయడం జరిగింది. ఇక పునీత్ రాజ్ కుమార్ నటించిన పలు సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి.

చివరి సినిమా ఏకంగా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముందు మందు మరిన్ని సినిమాలను పునీత్ రాజ్ కుమార్ తీసుకు రావాలనుకున్నాడు. కాని అనూహ్యంగా ఇలా జరిగింది. ఆయన తెలుగు అభిమానులు కూడా ఈ పరిణామంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు పలువురు పునీత్ రాజ్ కుమార్ కు శ్రద్దాంజలి ఘటించేందుకు గాను బెంగళూరు వెళ్లిన విషయం తెల్సిందే.