Begin typing your search above and press return to search.

స్టార్ హీరో చిత్రంలో మ‌రో సూప‌ర్ స్టార్!

By:  Tupaki Desk   |   4 Dec 2022 11:36 AM GMT
స్టార్ హీరో చిత్రంలో మ‌రో సూప‌ర్  స్టార్!
X
కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మిళ్ తో పాటు హిందీలోనూ స‌త్తా చాటిన న‌టుడు. అనువాద చిత్రాల‌తో టాలీవుడ్ లోనూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. `సార్` చిత్రంతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా క్రేజ్ పాన్ ఇండియాని తాక‌డంతో ఇక్క‌డ మార్కెట్ పై ధ‌నుష్‌ప్ర‌త్యేక దృష్టి సారించి ప‌ని చేస్తున్నాడు.

టాప్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేసేలా పావులు క‌దుపుతున్నాడు. త‌న త‌మిళ చిత్రాల్ని తెలుగులోనూ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుష్ హీరోగా అరుణ్ మాథేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `కెప్టెన్ మిల్ల‌ర్` తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ అడ్వెంచ్ చిత్ర‌మిది. సినిమా నిర్మాణానికి భారీ గా ఖ‌ర్చు చేస్తున్నారు. న‌టున‌టుల నుంచి టెక్నీషియ‌న్ల వ‌ర‌కూ అంతా సీనియ‌ర్లేన‌ని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ఏక‌గా క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ నే రంగంలోకి దించుతున్నారు. ఇందులో ధ‌నుష్ కి అన్న‌య్య పాత్రలో ఏ నటుడైతే బాగుంటుంద‌ని ప‌లువురు హీరోల పేర్లు ప‌రిశీలించి చివ‌రిగా శివ రాజ్ ని ఫైనల్ చేసారు. శివ‌రాజ్ కుమార్ ని ఎంపిక చేయ‌డం వెనుక మ‌రో కీల‌క అంశం కూడా ఉంది.

సూపర్ స్టార్ ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `జైల‌ర్` సినిమాలోనూ శివ‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ సినిమా తో వ‌చ్చే క్రేజ్ ని `కెప్టెన్ మిల్ల‌ర్` ఎన్ క్యాష్ చేసుకునేలా ఓ ప్లానింగ్ తో దించుతున్నారు. ఆయ‌న ఎంట్రీతో క‌న్న‌డ‌లోనూ సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. బిజినెస్ ప‌రంగానూ వ‌ర్కౌట్ అవుతుంది.

ఇలా ఇన్ని లెక్క‌ల‌తో శివ‌న్న‌ని సీన్ లోకి తెచ్చారు. ఇంకా సినిమాలో ధ‌నుష్‌కి జోడీగా మాళ‌విక మోహ‌న‌న్ న‌టిస్తోంది. తెలుగు న‌టుడు సందీప్ కిషన్.. నివేదిత.. సతీష్ ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళం తెలుగు మరియు హిందీలో వ‌చ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.