Begin typing your search above and press return to search.

పోకిరి, జల్సా..... త్వరలో శివ

By:  Tupaki Desk   |   5 Oct 2022 6:10 AM GMT
పోకిరి, జల్సా..... త్వరలో శివ
X
ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల అభిమానుల ముందుకు వారి యొక్క పాత సినిమాలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా మొదలుకుని పవన్ కళ్యాణ్‌ జల్సా ఇంకా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పాత సినిమాలకు కొత్త హంగులు అద్ది సౌండ్ సిస్టమ్‌ మరియు రెజల్యూషన్ ను మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

త్వరలోనే వాటి దారిలో అక్కినేని ఫ్యాన్స్ కోసం నాగార్జున నటించిన సినిమా విడుదల కాబోతుందట. ఈ విషయాన్ని అధికారికంగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.

4 కే రెజల్యూషన్ తో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. శివ సినిమాకు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్‌ సినీ చరిత్రలో శివ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటి వరకు మూస పద్దతిలో సినిమాలు వస్తున్న సమయంలో శివ వచ్చి ఇలా కూడా సినిమాలను చేయవచ్చా.. తీయవచ్చా అనే విధంగా ఒక విప్లవాన్ని ఇండస్ట్రీలో తీసుకు వచ్చింది. ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆధరిస్తారు అని అప్పటి నుండే ఇండస్ట్రీ వారికి అర్థం అయ్యింది.

శివ సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికి కూడా శివ అంటే ఒక అద్భుతం అన్నట్లుగానే చాలా మంది చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో నాగార్జునను రామ్‌ గోపాల్ వర్మ చూపించిన తీరుకు అప్పట్లో అభిమానులు మొత్తం ఫిదా అయ్యే వారు.

ఒక అద్భుతమైన పాత్రను తెలుగు ప్రేక్షకుల ముందుకు వర్మ తీసుకు వచ్చి మెప్పించాడు. ఇప్పుడు ఆ సినిమా వచ్చిన కూడా తప్పకుండా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.