Begin typing your search above and press return to search.

మనోళ్లకు మరో అరవ హీరో నచ్చేశాడు

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:52 AM GMT
మనోళ్లకు మరో అరవ హీరో నచ్చేశాడు
X
టాలీవుడ్‌ సినిమాల మార్కెట్‌ ఈమద్య కాలంలో అనూహ్యంగా పెరిగింది. బాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్నాయి. ఈమద్య కాలంలో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మెజార్టీ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతున్నాయి. కనుక ఇతర భాషల హీరోలు మరియు దర్శకులు తెలుగు సినిమాలపై దృష్టి పెడుతున్నారు. కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ అయిన ప్రశాంత్ నీల్‌ వరుసగా తెలుగు సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇక తమిళ దర్శకుడు శంకర్ కూడా తెలుగు లో రామ్‌ చరణ్ హీరోగా సినిమాను చేస్తున్నాడు. ఇక విజయ్‌ మరియు ధనుష్‌ లు తెలుగు లో నటించేందుకు సిద్దం అయ్యారు. వీరు మాత్రమే కాకుండా శివ కార్తికేయన్ కూడా తెలుగు లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

తమిళంలో మంచి పేరు దక్కించుకున్న శివ కార్తికేయన్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తీసుకు రాబోతున్నాడు. వీరి కాంబోలో సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. తెలుగు తమిళంలో ఏక కాలంలో రూపొందబోతున్న సినిమాను పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి శివ కార్తికేయన్‌ త్వరలో తెలుగు ప్రేక్షకుల అభిమానంను దక్కించుకోబోతున్నాడు అనుకుంటున్న సమయంలో అంతకు ముందే వరుణ్‌ డాక్టర్ అనే సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. డైరెక్ట్‌ తెలుగు సినిమా తో ప్రేక్షకులకు శివ కార్తికేయన్‌ ఖచ్చితంగా నచ్చుతాడని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా డబ్బింగ్ సినిమాతోనే శివ కార్తికేయన్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు.

తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది తమిళ హీరోలను అభిమానించి సక్సెస్‌ లు ఇచ్చారు. తాజాగా శివ కార్తికేయన్‌ ను కూడా తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసింది. ఒక మంచి కాన్సెప్ట్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఆ సినిమా తో శివ కార్తికేయన్ కు మంచి బ్రేక్‌ తెలుగు లో వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా వల్ల త్వరలో ఆయన చేయబోతున్న తెలుగు సినిమా ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. మొత్తానికి మరో అరవ హీరోను తెలుగు ప్రేక్షకులు ఆధరించి అభిమానిస్తున్నారు.