Begin typing your search above and press return to search.

కమల్‌.. శివ కార్తికేయన్‌ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   20 May 2022 10:30 AM GMT
కమల్‌.. శివ కార్తికేయన్‌ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌
X
తమిళ యంగ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ ఇటీవల వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన డాక్టర్ సినిమా గత ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకోగా ఇటీవల విడుదల అయిన డాన్‌ సినిమా కూడా మంచి కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

అందుకే ఈయన హీరోగా సినిమాలు ముందు ముందు మరిన్ని రాబోతున్నాయి. తెలుగు దర్శకుడు అనుదీప్ కూడా ఒక సినిమాను ఈయనతో చేస్తున్నాడు.

అనుదీప్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు అయిన విషయం తెల్సిందే. ఇక ఆ సినిమా కాకుండా కమల్‌ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ ఒక సినిమాను చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

ఇప్పుడు ఆ సినిమా కు సంబంధించిన టైటిల్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. మావీరన్‌ అనే టైటిల్‌ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లో శివ కార్తికేయన్‌ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రాజ్‌ కుమార్‌ పెరియాస్వామి దర్శకత్వంలో ఈ సినిమాను శివ కార్తికేయన్ చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా మావీరన్‌ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. కమల్‌ హాసన్ బ్రాండ్ వ్యాల్యూ కారణంగా సినిమా మరింత గా సూపర్‌ హిట్ అయినట్లే అంటూ సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కమల్‌ సినిమాల విషయానికి వస్తే విక్రమ్‌ తో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఉంది. కమల్‌ మాత్రమే కాకుండా ఆ సినిమా లో విజయ్‌ సేతుపతి మరియు ఫాహద్ ఫాజిల్ కూడా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.