శ్రియా భూపాల్ 'రాయల్' వెడ్డింగ్ పిక్స్..వైరల్!

Wed Jul 11 2018 14:47:04 GMT+0530 (IST)

Shirya Bhupal Royal Wedding Pics Viral In Social media

అపోలో సంస్థల అధినేత సీ.ప్రతాప్ రెడ్డి మనవడు అనిన్ దిత్ రెడ్డి - ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ల వివాహం గత శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ - మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ - ఉపాసన - నమ్రత శిరోద్కర్ - సితార - టెన్నిస్ స్టార్ సానియా మిర్జా - టాలీవుడ్ హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్ - లావణ్య త్రిపాఠిలతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియా తన పెళ్లి వేడుక కోసం రాయల్ వెడ్డింగ్ తరహాలో డ్రెస్ లు డిజైన్ చేయించారు. వెడ్డింగ్ తో పాటు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ లో జాతీయ - అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు ఆ డ్రెస్ లను రూపొందించారు.తన రిసెప్షన్ వేడుక కోసం శ్రియా...న్యూయార్క్ డిజైనర్ మార్కెసా రూపొందించిన గౌన్ ను ధరించారు. ఆ గౌన్ కు నప్పే విధంగా డైమండ్ నక్లెస్ ను మెడలో వేసుకున్నారు. పెళ్లి వేడుక కోసం తరుణ్ తహిలియాని రూపొందించిన పింక్ శారీని ఆమె ధరించారు. దాంతోపాటు ఆమె తల్లికి వారసత్వంగా సంక్రమించిన నగలను శ్రియా ధరించారు. సంగీత్ & మెహెందీ వేడుక కోసం - లెబనాన్ ఫ్యాషన్ డిజైనర్ ఎలీ సాబ్ రూపొందించిన వైట్ గౌన్ లో శ్రియా తళుక్కుమన్నారు. పెళ్లి వేడుకకు ముందు వీరిద్దరూ కలిసి పారిస్ లో ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ఇటాలియన్ డిజైనర్ వెల్లీ రూపొందించిన ఖరీదైన రెడ్ గౌన్ ధరించారు. తన పెళ్లి సందర్భంగా శ్రియా....గులాబీపూలతో అలంకరించిన వజ్రం పొదిగిన కిరీటం ధరించిన...యువరాణిలా కనిపించింది. రాయల్ వెడ్డింగ్ ను తలపించేలా ఉన్న ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.