Begin typing your search above and press return to search.

సామ్ ప్రెండ్ బికినీకి లైట్ కొట్టిన టాలీవుడ్ ప్రెండ్స్!

By:  Tupaki Desk   |   18 May 2022 12:30 PM GMT
సామ్ ప్రెండ్ బికినీకి లైట్ కొట్టిన టాలీవుడ్ ప్రెండ్స్!
X
స‌మంత డియ‌రెస్ట్ క్లోజ్ ప్రెండ్ శిల్పారెడ్డి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. మిస్ ఇండియాగా..క్యాలెండర్ గాళ్ గా పాపుల‌ర్ అయి అటుపై సామ్ కి ద‌గ్గ‌రైన ప్రెండ్. శిల్పారెడ్డి న‌టి కాక‌పోయినా సోష‌ల్ మీడియాలో అంత‌కు మించి పాపుల‌ర్ అయిన బ్యూటీ. త‌న‌దైన గ్లామ‌ర్ షోతో ఇన్ స్టా యువ‌త‌ని ఆక‌ట్టుకోవ‌డంలో శిల్పా మార్క్ క‌చ్చితంగా ఉంటుంది.

ఫోటో సెష‌న్స్ లో రేర్ గా పాల్గొన్న అటెన్ష‌న్ మాత్రం మామూలుగా ఉండ‌దు. ఒక్కో ఫోటో యువ‌త గుండెల్లో బాణంలా దిగిపోతుంది. తాజాగా శిల్పారెడ్డి బికినీ ట్రీట్ ఇచ్చింది. ఆ నాటి బికినీ క్యాలెండ‌ర్ రోజులు స్మ‌రించుకుంటూ మ‌రోసారి స్విమ్ షూట్ లో మంట‌లు రేపుతుంది.

ఎరుపు రంగు మోనో కినీలో శిల్పా గ్లామ‌ర్ ట్రీట్ పీక్స్ లో ఉంది. అటుపై టూపీస్ బికినీలో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అలాగే ఈ ఫోటోని ఉద్దేశించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

''నేటి జ‌న‌రేష‌న్ లో శృంగారం అనే దాన్ని పూర్తిగా నెగిటివ్ గా అర్ధం చేసుకుంటున్నారు. శృంగారం అంటే ఒక‌టే అర్ధం ధోర‌ణిలో ఆలోచ‌న జ‌రుగుతుంది. ఫోటో షూట్లు అనేవి చాలా ప‌రిమితంగానే ఉంటాయి. వాటిలో ఎలాంటి అశ్లీల‌త ఉండ‌దు. చూసే విధాన్ని బ‌ట్టే ఫోటో క‌నిపిస్తుంది. ఇంద్రియాల‌కు సంబంధించిన అవ‌స‌రాల్లో చాలా ప‌రిమితంగానే ఉంటాం' అని తెలిపింది.

ఈ ఫోటోని..ఆమె సందేశం చాలా మంది సెల‌బ్రిటిల్ని ఆక‌ట్టుకుంది. దీంతో స‌మంత‌..మంచు ల‌క్ష్మి.. సుస్మిత కొణిదెల వంటి వారు ఆ బికినీ ఫోటోకి లైక్ కొట్టారు. అలాగే శిల్పారెడ్డి పై ప్రశంస‌లు కురిపించారు. మరి వీళ్లిచ్చిన ప్రోత్సాహాన్ని ఎంత మంది స్వీక‌రిస్తారు? మ‌రెంత మంది వ్య‌తిరేకిస్తారు? అన్న‌ది చూద్దాం.

శిల్పారెడ్డి కి టాలీవుడ్ లో చాలా స్నేహితులున్నారు. ఇండ‌స్ర్టీని నుంచి మంచి ప‌రిచ‌యాలున్నాయి. కానీ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. సామాజిక వేత్త‌గా..బిజినెస్ ఉమెన్ గానే రాణిస్తున్నారు. ఆమె పుట్టి పెరిగింది హైద‌రాబాద్ లోనే. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 41 ఏళ్లు. స‌మంత క్లోజ్ ప్రెండ్ కావ‌డంతో ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన సూచ‌న‌లు..స‌ల‌హల్లో సైతం శిల్పారెడ్డి భాగ‌మ‌వుతుంది.