లండన్ లోని శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా రాజ్ మహల్ చూశారా?

Mon Jul 26 2021 11:00:41 GMT+0530 (IST)

Have you seen the Shilpa Shetty-Raj Kundra Raj Mahal in London?

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొబైల్ యాప్స్ లో అశ్లీల వీడియోలను పెట్టి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు 27 వరకు రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో తాజాగా శిల్పా-రాజ్ కుంద్రాలను వారి ఇంట్లోనే విచారించారు. శిల్పాకు రాజ్ కుంద్రా భారీ మొత్తంలో ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇచ్చాడు.శిల్పా-రాజ్ కుంద్రా ఆస్తుల లెక్క అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీరికి బ్రిటన్ దేశంలోని లండన్ లోని సర్రే ప్రాంతంలో పెద్ద ‘రాజ్ మహల్’ ఉన్నట్టుగా తెలుస్తోంది. యూనైటెడ్ కింగ్ డమ్ లోని సెయింట్ జార్జ్ హిల్ ఎస్టేట్ లో ఉన్న ఈ విలాసవంతమైన భవనాన్ని తన ప్రియురాలు శిల్పాశెట్టికి రాజ్ కుంద్రా బహుమతిగా ఇచ్చారని తేలింది. ఈ గిఫ్ట్ ఇచ్చిన సమయంలో రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవితకు ఇంకా విడాకులు ఇవ్వలేదన్న విషయం తాజాగా బయటపడిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక లండన్ లోని ఈ రాజ్ మహల్ ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం శిల్పాశెట్టి దగ్గరుండి చూసుకుందట.. 2006లో 3.2 మిలియన్లకు ఈ ఖరీదైన ఇంటిని కొన్నారట.. ఈ భవనం మూడు బాల్కనీలు మరియు విస్తారమైన గార్డెన్ ను కలిగి ఉంది. ఈ జంట త్రిపుల్ బాల్కనీల కింద తమ ఖరీదైన కార్లను పార్క్ చేసినట్లు సమాచారం.

ఈ భవనం బ్రిటీష్ కట్టడాలైన ‘ఎఫ్’ భవనంను పోలి ఉందట.. అద్భుతమైన స్తంభాలతో హైలెట్ గా కనిపిస్తుందట.. ప్యాలెస్ లో ఎడమవైపున రిసెప్షన్ గదులతోపాటు.. గ్రాండ్ హాల్ ఈత కొలను కలిగి ఉంది.

ఇదే కాదు.. ఈ జంటకు ముంబైలోని జుహూ బీచ్ ప్రాంతంలో మరో ఖరీదైన బంగ్లాను కలిగి ఉన్నారు. విలాసవంతమైన ఇంటిలోపల ఇంటీరియర్ ను శిల్పాశెట్టియే తీర్చిదిద్దంని సమాచారం.  ఇది ఇంద్రభవనంను తలపిస్తుందని తాజాగా వైరల్ అయిన ఫొటోలను బట్టి తెలుస్తోంది.

మొత్తంగా రాజ్ కుంద్రా-శిల్పాశెట్టిలు భారీగా ఆస్తులు ఖరీదైన విల్లాలు కలిగి ఉన్నారని పోలీసుల విచారణలో బయటపడుతోందట.. మరి ఇంకా ఎన్నెన్ని ఉన్నాయనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.