Begin typing your search above and press return to search.

ఆమె క్రేజ్‌ ఆకాశం నుండి పాతాళంకు పడిపోయింది

By:  Tupaki Desk   |   31 July 2021 10:30 AM GMT
ఆమె క్రేజ్‌ ఆకాశం నుండి పాతాళంకు పడిపోయింది
X
మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ తో పాటు మొత్తం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకుని స్టార్‌ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగి ఇప్పుడు ఇండస్ట్రీలో సీనియర్‌ నటిగా.. హోస్ట్‌ గా జడ్జ్ గా ఎన్నో విధాలుగా కొనసాగుతూ వస్తున్న శిల్పా శెట్టి కెరీర్‌ ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. మూడు దశాబ్దాల నుండి పెంచుకుంటూ.. కాపాడుకుంటూ వస్తున్న క్రేజ్‌ ఒక్కసారిగా ఈ సినిమాతో కోల్పోయినట్లయ్యింది. ఇండస్ట్రీలో ఆమె గురించి గొప్పగా అనుకునే వారు ఇప్పుడు ఆమెను చీప్ గా చూస్తున్నారు. అందుకు కారణం ఆమె భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అవ్వడం.

అశ్లీల సినిమాలతో వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్న రాజ్ కుంద్రా అది అంతా కూడా శిల్పా శెట్టికి తెలియకుండా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది అబద్దం అవుతుంది. ఎందుకంటే భార్య భర్తలు అంటే ప్రతి ఒక్క విషయం తెలుస్తూనే ఉంటుంది. సుదీర్ఘ కాలంగా ఆయన ఈ పని చేస్తున్నాడు కనుక శిల్ప శెట్టి పాత్ర ఏదో ఒక విధంగా ఆ కార్యక్రమంలో ఉండే ఉంటుంది అనేది ఎక్కువ మంది నమ్మకం. ఆమె ఈమద్య కాలంలో మీడియా ముందుకు రాకపోవడం.. భర్త ను ఇప్పటికి కూడా వెనకేసుకు వచ్చేలా మాట్లాడటం వంటి కారణాల వల్ల విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది. అందువల్ల ఇప్పుడు ఆమెతో షో అన్నా లేదా మరేదైనా ప్లాన్‌ చేసినా కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల నుండి విమర్శలు తప్పవు. అందుకే శిల్ప శెట్టిని ఇప్పటికే జడ్జ్‌ గా వ్యవహరిస్తున్న సూపర్‌ డాన్సర్ షో నుండి తప్పించారు.

ఒకప్పుడు ఆ షో ను కేవలం శిల్ప కోసం చాలా మంది చూసేవారు. కాని ఇప్పుడు ఆమె ఉంటే షో రేటింగ్‌ పడిపోతుందంటూ నిర్వాహకులు ఆమెను తప్పించారు. ఆమె వల్ల ఇప్పటికే షో కు చాలా డ్యామేజీ అయ్యిందంటూ బాలీవుడ్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. శిల్ప శెట్టి తప్పుకోవడంతో ఆ స్థానంను ప్రస్తుతానికి జెనీలియా దంపతులు భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వరకు శిల్ప శెట్టి స్టార్‌.. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి అవ్వడం వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆమెను కీర్తించే వారు. కాని ఇప్పుడు మాత్రం ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. మొత్తానికి శిల్ప శెట్టి ఆకాశం నుండి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినంత పనైంది.