Begin typing your search above and press return to search.

ఉప్పెన లుక్‌: ఆ క‌ళ్ల‌తోనే మాయ చేసేస్తోంది

By:  Tupaki Desk   |   2 April 2020 7:30 AM GMT
ఉప్పెన లుక్‌: ఆ క‌ళ్ల‌తోనే మాయ చేసేస్తోంది
X
క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికించే నాయిక‌లు ఈ రోజుల్లో అరుదు. నాటి మేటి న‌టీమ‌ణుల్లో భానుమ‌తి.. సావిత్రి.. భానుప్రియ .. శ్రీ‌దేవి క‌ళ్ల‌తో ఎక్స్ ప్రెష‌న్స్ ప‌రంగా ప్రూవ్ చేశారు. ఇటీవ‌ల కాలంలో న‌వ‌త‌రం నాయిక‌ల్లో అలాంటి ప్ర‌తిభావంతులు ఎంద‌రు ఉన్నారు? అంటే వేళ్ల‌పై లెక్కించేంత మంది ని కూడా చూపించ‌లేరు. ముంబై క్యాట్ వాక్ భామ‌ల‌తో పోలిస్తే మ‌ల్లూ భామ‌లు కాస్త అభిన‌యంలో మ‌న పాతత‌రం న‌టీమ‌ణుల్ని త‌ల‌పించ‌డం పెద్ద ప్ల‌స్ అవుతోంది. తెలుగు సినిమాల్లో అవ‌కాశాల వెల్లువ ఈ భామ‌ల‌కే ఎందుకు అంటే ఇలాంటి కొన్ని క్వాలిటీస్ ఉండ‌డం వ‌ల్ల‌నే.

ఇదిగో ఈ పోస్ట‌ర్ లో క‌వ్విస్తున్న ఈ అమ్మ‌డిని చూస్తుంటే అలాంటి ఓ మంచి కోణం క‌నిపిస్తోంది. ఈ భామ‌ పేరు కృతి శెట్టి. న‌టిస్తున్న సినిమా ఉప్పెన‌. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ద‌ర్శ‌కుడు. సాయి తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ ఇదే చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తి పోస్ట‌ర్ లో కృతి ఎక్స్ ప్రెష‌న్ గురించో ఆ అంద‌చందాల గురించో మ‌మేకం అయిపోయి ముచ్చ‌టించుకుంటోంది యూత్. ఈ అమ్మ‌డి కోస‌మైనా సినిమాకి వెళ్లాలేమో! అన్న టాక్ అయితే ఉంది. ఇక‌పోతే ఈ సినిమాలో వైష్ణ‌వ్ తేజ్ ఒక బెస్త‌వానిగా ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపిస్తున్నాడు. కృతి శెట్టి మోతుబ‌రి అయిన విజ‌య్ సేతుప‌తి కుమార్తె గా న‌టిస్తోంద‌న్న స‌మాచారం ఉంది.

స్వ‌త‌హాగా గారాల ప‌ట్టి.. సుకుమారి కాబ‌ట్టి స్కూల్ కి కానీ కాలేజ్ కి కానీ వెళుతుంటే ఆ సుకుమార సౌంద‌ర్యంపై కుర్రాళ్ల‌ క‌ళ్లు ప‌డ‌కుండా ఉంటాయా?.. అలానే వెంట‌ప‌డుతుంటాడు వైష్ణ‌వ్ తేజ్. ఇదిగో ఈ పోస్ట‌ర్ లో థీమ్ కూడా అదే. ఇక ఆ క‌ళ్ల‌తోనే మాయ చేసేస్తోంది కృతి. కూత్ కూత్ అంటూ కుక్క‌పిల్ల‌లా వెంట ప‌డుతున్నాడు వైష్ణ‌వ్ బాబు. బైక్ పై వెళుతుంటే ఆ కొంటె పిల్ల క‌వ్వింత‌కు ఇట్టే స్పెల్ బౌండ్ అయిపోయాడు. ఈ క‌వ్వింత తుళ్లింత సినిమా ఆద్యంతం వ‌ర్క‌వుటైతే తేజ్ కి హిట్టు ద‌క్కే వీలుంటుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ క‌ల్లోలం ఇబ్బందిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. యువ హీరో డెబ్యూకి ప్ర‌మాద‌క‌ర వైర‌స్ పెద్ద అడ్డంకిగానే మారింది. పాపం క్యూట్ కృతి కూడా ఇదే సినిమాతో ప‌రిచ‌యం అవుతోంది కాబ‌ట్టి త‌న‌కు కూడా ఈ సీజ‌న్ పెద్ద మైన‌స్ అనే భావించాల్సి వ‌స్తోంది.