షేర్షా జోడి.. ఇంకా ఎన్నాళ్ళు ఈ పెళ్లి గోల!

Wed Aug 17 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Shershaah jodi.. How long will this wedding go on!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించగానే హీరో హీరోయిన్లపై ఒక రేంజ్ లో రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. వారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి రూమర్లతో ఎక్కువగా వైరల్ అయిన జోడీలలో సిద్ధార్థ మల్హోత్రా కీయరా అద్వానీ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పాలి.కీయరా అద్వానీ ఒకవైపు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే మరోవైపు తెలుగు హీరోలతో కూడా బిగ్ బడ్జెట్ సినిమాలలో నటిస్తోంది. అయితే ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి.

ముఖ్యంగా సిద్ధార్థతో ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా కూడా కొంతమంది సన్నిహితులు డైరెక్ట్ గా స్పందించడం అప్పట్లో అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇక షేర్షా సినిమాలో నటించిన తర్వాత వీరికి సంబంధించిన పెళ్లి వార్తలు అయితే మరింత ఉపందుకున్నాయి.

ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అఫీషియల్ అన్నట్లుగా వార్తలు మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని మరోవైపు సిద్ధార్థ మల్హోత్రా క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక కీయరా అద్వానీ కూడా అలాంటిదేమీ లేదు అన్నట్లుగానే చాలాసార్లు స్పందించింది. అయినప్పటికీ కూడా ఆ వార్తలు ఏ మాత్రం తగ్గలేదు.

ఇక రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షాలో సిద్ధార్థ మల్హోత్రా ఆ విషయంపై మరింత అనుమానాలు వచ్చేలా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కీయరా తో డేటింగ్ చేస్తున్నావుగా ఇంకేంటి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నావా అంటూ కరణ్ అడగగానే నాకు ఏమీ అర్థం కావడం లేదు.. సారీ.. అంటూ ఆ ప్రశ్నకు సమాధానం దాటవేశాడు. అందులో నిజం లేకపోతే..

ఏమీ లేదు అని సమాధానం ఇవ్వవచ్చుగా అని సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్ గానే స్పందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మరోసారి బాలీవుడ్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ వార్తలకు ఎప్పుడు ముగింపు కార్డు పెడతారో చూడాలి.