మాస్ ప్లస్ మాస్ మెగా మాస్ స్టెప్పులతో దుమ్ము లేపుతారా?

Tue Nov 23 2021 19:00:02 GMT+0530 (IST)

Shekhar Master Preparation for Megastar

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. మాస్ నంబర్ల విషయానికి వస్తే.. అతను స్పెషలిస్ట్ డ్యాన్స్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కి ఇప్పుడు బిగ్ ఛాలెంజ్ లో నిరూపించుకునే సమయం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోసం మెగా డ్యాన్స్ నంబర్ ను కంపోజ్ చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే చిరుతో పని చేసిన మాస్టర్ ఇప్పుడు కొత్తదనం నిండిన మాస్ నంబర్ ని ఇవ్వాల్సి ఉంది. ఇది నిజంగానే అతడికి ఓ బిగ్ ఛాలెంజ్. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి మెచ్చే బెస్ట్ స్టెప్పుల్ని కొరియోగ్రాఫ్ చేసేందుక శేఖర్ చాలానే శ్రమించాల్సి ఉంటుంది.మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` కోసం ఓ పాటను కంపోజ్ చేయనున్నారు. పాట ప్రాక్టీస్ సెషన్  లో శేఖర్ మాస్టర్ చిరంజీవితో ఇదిగో ఇలా  పోజులిచ్చాడు. మాస్ ప్లస్ మాస్ మెగా మాస్ స్టెప్పులతో దుమ్ము లేపుతారా? అన్నది వేచి చూడాలి.

శేఖర్ ఇప్పటికే చిరు కోసం `ఖైదీ నంబర్ 150`.. `ఆచార్య` వంటి చిత్రాలకు డ్యాన్స్ ని కొరియోగ్రాఫ్ చేశారు. భోళాశంకర్ పాటను త్వరలో చిత్రీకరించనున్నారని తెలిసింది.  శేఖర్ మాస్టర్ ముందు బిగ్ ఛాలెంజ్ ఉంది. మెగా బాస్ కి సిగ్నేచర్ స్టెప్స్ ఇచ్చి దానిని నిరూపిస్తారనే భావిద్దాం.