కమ్ముల 'లవ్ స్టోరీ' అప్ డేట్

Wed Sep 30 2020 22:30:00 GMT+0530 (IST)

Kammula 'Love Story' Update

ఫిదా తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల గత ఏడాది నాగచైతన్య మరియు సాయి పల్లవిలతో 'లవ్ స్టోరీ' సినిమాను ప్రారంభించాడు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయాల్సి ఉండగా కరోనా ఆరు నెలలు షూటింగ్ వాయిదా పడింది. పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఇటీవలే బ్యాలన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. షూటింగ్ పూర్తి అయ్యే వరకు యూనిట్ సభ్యులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా బయటి వారు కూడా షూటింగ్ స్పాట్ కు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ ను చేస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్యాచ్ వర్క్ చేస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నాడు.రెండు మూడు వారాల్లో సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా స్పీడ్ గా పూర్తి చేయబోతున్నారు. అక్టోబర్ లో లేదా నవంబర్ మొదటి వారం వరకు సినిమా ఫస్ట్ కాపీని రెడీ చేయాలని శేఖర్ కమ్ముల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా ను థియేటర్లు ఓపెన్ అయ్యేదాన్ని బట్టి విడుదల చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి వరకు సినిమాను వాయిదా వేస్తారా లేదా ముందే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఆకట్టుకుంది. మరోసారి సాయి పల్లవితో శేఖర్ కమ్ముల ఫిదా చేయడం ఖాయం అంటూ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.